38.2 C
Hyderabad
May 3, 2024 19: 34 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఆక్రమ నిర్మాణాలపై కొరడా

గత కొద్ది రోజుల నుండి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య అక్రమ నిర్మాణాల పైనా, అక్రమంగా నడుపుతున్న కమర్షియల్ దందాలపైనా ఉక్కు పాదం మోపుతున్నారు. గురువారం తెల్లవారు జామున కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య ఆధ్వర్యంలో తాహాసిల్దార్ రమేష్ సమక్షంలో పట్టణంలోని ఆర్టిసి డిపో వెనకాల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ యాలాద్రి బందోబస్తు నిర్వహించారు. ఎస్సైలు, పోలీసులు బందోబస్తు మధ్యన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

మరోపక్క ఓ ప్రజాప్రతినిది భర్త మొదటగా ఈ నిర్మాణాల సమయంలో ఒక్కొక్కరి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు కౌన్సిలర్స్ కూడా ఇదే మాట చెబుతు వచ్చారు. మున్సిపాలిటీలో 60, 40 వాటా నడుస్తుందని చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే నిజమే అయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్రమ కూల్చివేత లపై మున్సిపల్ కమిషనర్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

అదే విధంగా ఈ కూల్చివేత సింహం గుర్తుతో గెలిచిన కౌన్సిలర్ ల పోరాటాల కృషి పలితమేననీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోసం కష్టపడ్డ సుదర్శన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అంతే కాకుండా జూపల్లి వర్గంలోకి వాల్మీకులు, రజకుల వలసలు అంటూ జై జూపల్లి అంటూ కామెంట్స్ తో పోస్టులు పెడుతున్నారు కొందరు.

ఎందుకు కూల్చడం లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి

అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తాలో అక్రమంగా నిర్మాణం చేసిన కమర్షియల్ బిల్డింగ్ విషయం లో కూడా చర్చ జరుగుతున్నది. అనుమతికి మించిన అంతస్తులను డిస్మెండలింగ్ చేయలని ఉన్నత అధికారులు ఇప్పటికే ఆదేశించారు. మునిసిపల్ కమిషనర్ దగ్గర ఉండి మరీ ఆ భవనం స్లాబ్ కు హోల్స్ వేయించారు.

ఇలాంటి చర్యలు తీసుకున్నా కూడా తదుపరి చర్యలు కనిపించడం లేదు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల ప్రకారం మొత్తం రెండు ఫ్లోర్లు, పెంట్ హౌస్ కూల్చ లేదు. ఎందుకు కూల్చడం లేదో, అందులోని మర్మం ఏమిటో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని కొందరు కౌన్సిలర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఊరికే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు, సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారులకు సపోర్టుగా ఉండాలని కొందరు కౌన్సిలర్స్ హితవు చెబుతున్నారు.

Related posts

విషవాయువు లీకేజీ విచారణకు కేంద్ర కమిటీ

Satyam NEWS

ఇలా గుంపులు గుంపులుగా …..మ‌రి అలాగైతే వైర‌స్ కు అడ్డ‌కట్ట ఎలా..?

Satyam NEWS

ప్రాణాలు కాపాడే ప్రత్యక్ష దైవాలు మన డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment