28.7 C
Hyderabad
May 15, 2024 02: 37 AM
Slider కడప

అకాల వర్షంతో అల్లాడుతున్న మామిడి రైతు

అకాల వర్షం కారణంగా అన్నమయ్య జిల్లా రాయచోటి , లక్కిరెడ్డి పల్లె, సుండుపల్లి, వీరబల్లి, రామాపురం మండలాల్లో మామిడి రైతులు తీవ్ర నష్టపోయారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు

లక్కిరెడ్డి పల్లె మండలంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించి, తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ చూసినా మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోయి, చెట్లు మొత్తం విరిగిపోయారన్నారు.

నేలకు రాలిపోయిన మామిడి కాయలను రైతులు అమ్ముకోలేక , దేనికి పనికిరాకుండా పోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మామిడి రైతులు పూర్తిగా తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోని, ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

అధికారులు పార్టీలకు అతీతంగా నష్టపోయిన మామిడి రైతులకు అంచనా వేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. నష్టపోయిన వైస్సార్సీపీ పార్టీ రైతులకు మాత్రమే నష్టపరిహారం రాస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి అందరికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.

Related posts

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

Satyam NEWS

ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న ఆసుపత్రి సీజ్

Satyam NEWS

వికృత కామెంట్లతో ఆర్ధిక లాభం?

Satyam NEWS

Leave a Comment