29.7 C
Hyderabad
May 6, 2024 04: 10 AM
Slider మహబూబ్ నగర్

అలవాటుగా సారా తయారు చేసి అమ్ముతున్న వ్యక్తి జైలుకు

#ExicePolice

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని సల్కాపూర్ తండాకు చెందిన ఇస్లావత్ వాచ్యా  అనే వ్యక్తి సారా అమ్మినందుకు  ఒక సంవత్సరం పాటు జైలు కు పంపామని వనపర్తి ఆబ్కారీ ఇన్స్పెక్టర్ సుభాష్ చందర్ రావు విలేకరులకు తెలిపారు.  

ఈ వ్యక్తి మొదట నవంబర్ నెలలో సారాయి అమ్ముతూ పట్టుబడగా కేసు నమోదు చేసి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయించగా లక్ష రూపాయల షూరిటీ పై సారాయి తయారు బంద్ చేస్తామని ఎమ్మార్వో ముందు సంతకం చేశారని, కానీ   డిసెంబర్ నెలలో మళ్లీ సారా తయారు చేస్తూ పట్టుబడ్డారన్నారు.

దాంతో మళ్లీ కేసు నమోదు చేశామని,  బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను లక్ష రూపాయల జరిమానా చెల్లించనందుకు  ఒక సంవత్సరం పాటు జైలుకు పంపుతూ ఖిల్లా ఘణపురం తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని  జిల్లా జైలు- కారాగారం మహబూబ్ నగర్ కు తరలించామని ఆయన చెప్పారు.

ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసిన అమ్మినా, బెల్లం అమ్మకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  హెచ్చరించారు. అవసరమైతే ఎవరిమీదైనా పిడి చట్టం కూడా ప్రయోగించడానికి వెనుకాడమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై కళాధర్ ,  కానిస్టేబుల్  రంజిత్,  మన్యం, చంద్రశేఖర్ ,సురేష్ గౌడ్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ECIL బస్ టెర్మినల్ ఎదురుగా U టర్న్ డివైడర్ మళ్లీ కూలిపోయింది…

Satyam NEWS

మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Satyam NEWS

వివాహిత కుమార్తెకు కూడా కారుణ్య నియామకం అర్హత

Satyam NEWS

Leave a Comment