29.7 C
Hyderabad
May 4, 2024 03: 28 AM
Slider ముఖ్యంశాలు

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

#Shanti Kumari

పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బిసి కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్బంగా సి.ఎస్. మాట్లాడుతూ, పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి పథకం క్రింద లబ్దిదారులను ఎంపిక చేయాలని, గృహలక్ష్మి పథకం కింద 3 విడతల్లో లక్ష రూపాయల చొప్పున మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, ధరణి లో నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్ డేట్ చేయాలని సూచించారు.

తెలంగాణకు హరితహారం క్రింద, గ్రామాల వారిగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం క్రింద పిట్టింగ్ పూర్తి చేయించాలని అన్నారు. బీసి కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం క్రింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అన్నారు.

రెండవ దశ గొర్రెల పంపిణీ యూనిట్లపై లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన బృందం ఆధ్వర్యంలో గొర్రెల కొనుగొలు చేయాలని అన్నారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన గ్రామ పంచాయతీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నార

Related posts

ఉత్తర నక్షత్ర పూజ: స్వామి యే శరణం అయ్యప్ప

Satyam NEWS

దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇకలేడు

Satyam NEWS

చదువురాని ఆశావర్కర్ల తో ఇబ్బందులు

Satyam NEWS

Leave a Comment