31.2 C
Hyderabad
May 3, 2024 01: 25 AM
Slider ఖమ్మం

19,160 మంది రైతుల ఖాతాల్లో రూ. 23,63,24,250 లు జమ

#Collector V.P

ఈ సంవత్సరం మార్చి 17 నుండి 21 తేదీల మధ్య కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో జిల్లాలో యాసంగి సీజన్లో సాగు చేస్తున్న ప్రధాన పంటలైన మొక్కజొన్న, పెసర, నువ్వులు, ఇతర పంటలకు జరిగిన నష్టం మేరకు, పంట నష్ట పరిహారం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 19,160 మంది రైతులకు సంబంధించి, 23,632.17 ఎకరాల పంట నష్టం జరిగినట్లు తుది నివేదిక రూపొందించడం జరిగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్చి 23న జిల్లాలో పర్యటించి, అకాల వర్షాలు, వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారని,

ఆ మేరకు దెబ్బతిన్న 23,632.17 ఎకరాల పంట నష్టానికి రూ. 23 కోట్ల 63 లక్షల 24 వేల 250 లు 19,160 మంది రైతుల ఖాతాల్లో జమచేసినట్లు కలెక్టర్ అన్నారు.ముఖ్యమంత్రి పర్యటన అనంతరం వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారిచే జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా పంట నష్ట వివరాలు సర్వే, సేకరణ చేపట్టడం జరిగిందన్నారు.

జిల్లా పరిధిలో 129 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు, 41 మంది వ్యవసాయ అధికారులు, 10 మంది సహాయ వ్యవసాయ సంచాలకులను బృందాలుగా ఏర్పాటుచేసి, మార్చి చివరి వారం నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు క్షేత్ర స్థాయిలో ప్రతి చేనును పరిశీలించి, సమగ్రంగా పంట నష్టం అంచనా వేయడం జరిగిందన్నారు.

సర్వే సమయంలో పంట సాగు చేస్తున్న రైతుకు సంబంధించి, పంట సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, నష్టపోయిన విస్తీర్ణం, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా తదితర వివరాలు నిర్ణీత ప్రామాణికం మేరకు సేకరించినట్లు ఆయన తెలిపారు. పంట నష్ట ఆర్థిక సహాయం పంట సాగు చేస్తున్న సాగుదారుకి (కౌలుదారు) అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

క్షేత్ర స్థాయిలో సేకరించిన పూర్తి వివరాలు జిల్లా వ్యవసాయ శాఖచే యుద్ధ ప్రాతిపదికన ఆన్లైన్ చేయించినట్లు ఆయన తెలిపారు. అధికారులు సేకరించిన పంట సాగు వివరాలు రైతు బంధు పోర్టల్ లో నమోదు అయిన పంట సాగు వివరాలతో సరిపోల్చడం జరిగినట్లు ఆయన అన్నారు. సాగు/కౌలుదారుల బ్యాంకు ఖాతా వివరాలు జిల్లా పరిధిలో ఉన్నవి, లేనివి పరిశీలన చేసి, పూర్తిగా *పంట నష్ట ఆర్థిక పరిహారం సాగు/కౌలుదారుల బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

పకడ్బందీ పరిశీలన పిదప యాక్సిస్ బ్యాంక్, ఖమ్మం బ్రాంచ్ ద్వారా పంట నష్ట పరిహారం నేరుగా ఎన్ఇఎఫ్ టి ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా రైతుల ఖాతాలకు జమచేయడం జరిగిందని ఆయన అన్నారు. *జిల్లాలో ఈ నెల 7 నుండి 14 వరకు 19,160 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 23 కోట్ల 57 లక్షల 76 వేల 750 లు జమ చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Related posts

తిరుపతి ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ

Satyam NEWS

తాడేపల్లి ప్యాలెస్ వీడి బయటకు రావడానికి భయపడుతున్న జగన్ రెడ్డి

Satyam NEWS

అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై హిందూసేన దాడికి నిరసన

Satyam NEWS

Leave a Comment