38.2 C
Hyderabad
May 5, 2024 20: 19 PM
Slider ముఖ్యంశాలు

సంక్లిష్ట స్థితిలో కార్మికోద్యమాలు

#Labor movements

ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర ఉద్యమాలు సంక్లిష్ట స్థితిలో ఉన్నాయని, కార్మిక ఉద్యమాలు ప్రమాదంలో పడ్డాయని ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కార్మిక హక్కులను హరించి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న స్థితిలో ఉన్నామన్నారు.

ఖమ్మం గట్టయ్య సెంటర్ లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బీటీ రణదీవే సీఐటీయూ జిల్లా కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. అధికారంలో ఉన్న బీజేపీ దుర్మార్గం ఒక్కటే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర ఉద్యమాల మనుగడ ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. గతంలో లాగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లోపించిందన్నారు. జీవించే హక్కును కూడా లాగేసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అంతరాలు పెరిగాయన్నారు.

రకరకాల వైషమ్యాలు ముందుకు వచ్చి శ్రామిక ప్రజలు ఐక్యం కాకుండా అడ్డుకుంటున్న దుష్పరిణామం ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు.కార్మిక వర్గం ఐక్యతకు సీఐటీయూ కేంద్ర బిందువుగా నిలుస్తుందని యూనియన్ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మందబలంతో రద్దుచేసి కార్మిక వర్గాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మిక వర్గం సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తక్షణం కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కార్మికవర్గం చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.

కార్మికవర్గ ఐక్యతని పాలకవర్గం నిరంతరం విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుందన్నారు. ఈ ప్రమాదాన్ని కార్మిక వర్గం ఎప్పటికప్పుడూ గమనిస్తూ మరింత ఐక్య పోరాటాలు నిర్వహించాలని సూచించారు. రాజకీయాలకతీతంగా కార్మిక వర్గ ఐక్యత కోసం సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఖమ్మంలో సీఐటీయూ కార్యాలయం కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుందని, కార్మికుల అందరి కార్యాలయంగా అందరి భాగస్వామ్యంతో త్వరలో ఇది ప్రారంభానికి సిద్ధం కావాలని ఆకాంక్షించారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల అందరి దగ్గరికి వెళ్లి.. కలిసికట్టుగా కార్మిక శక్తితో ఈ భవనం రూపుదిద్దుకోవాలని కోరారు.

Related posts

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై ఉక్కుపాదం

Satyam NEWS

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

Satyam NEWS

Leave a Comment