28.7 C
Hyderabad
May 6, 2024 07: 48 AM
Slider ప్రత్యేకం

తాడేపల్లి ప్యాలెస్ వీడి బయటకు రావడానికి భయపడుతున్న జగన్ రెడ్డి

#NBSudhakarreddy

ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి భయం వీడి ఇంటి నుంచి  బయటికి వచ్చి కరోనా విలయాన్ని కళ్లారా చూడాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు.

రాష్ట్రంలో కరోనా సోకి  37 మంది చనిపోయినా సీఎంలో చలనం లేక పోవడం శోచనీయం అన్నారు.

రాజకీయ లబ్ది కోసం ఓదార్పు యాత్రలు చేసిన వ్యక్తికి ఇప్పుడు  కరోనా మరణాలు కినిపించ లేదా  అంటూ ఎద్దేవా చేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఆసుపత్రులు ఉన్న నగరాలలో సేవాకేంద్రాలు ఏర్పాటుచేసి మంత్రులు స్వయంగా  పర్యవేక్షించాలని కోరారు.

అలాగే జగన్ ప్రత్యేక వాహనంలో రాష్త్ర వ్యాప్తంగా పర్యటించి రోగులకు ధైర్యం చెప్పడంతో పాటు ఆసుపత్రులలో జరిగే దోపిడీలను, మోసాలను అరికట్టాలని సూచించారు.

జగన్ ఈ విషయంలో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

సీఎంకు చేతకాక పొతే ప్రతి పక్ష నేత చంద్రబాబుకు  అనుమతి ఇస్తే అయన నేతృత్వంలో టీడీపీ శ్రేణులు సేవలు అందించడానికి సిద్ధంగా వున్నాయని  తెలిపారు.

జగన్ తీరు చూస్తే పిల్లికి భయపడి కలుగులో దాక్కున్న ఎలుక గుర్తుకు వస్తోందని చమత్కరించారు.

బెయిల్ రద్దయి జైలుకు వెళ్ళాల్సి వస్తుందన్న భయం, ఇతర ప్రతికూల అంశాలు ఆయనలో ఆందోళన, మానసిక ఒత్తిడి,డిప్రెషన్ ను కలిగించి ఉంటాయని అన్నారు. దీని వల్లనే అయన ఇల్లు వదలి బయటికి రావడం  లేదేమోనన్న అనుమానం వ్యక్తం చేసారు.

Related posts

నిజామాబాద్ దాహం తక్షణమే తీరుస్తాం

Satyam NEWS

కొల్లాపూర్ చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ భేరి ప్రచార యాత్ర

Satyam NEWS

ఎన్నికల విధులు ఇచ్చేముందు మా సమస్యలు చూడండి

Satyam NEWS

Leave a Comment