38.2 C
Hyderabad
April 27, 2024 17: 05 PM
Slider గుంటూరు

అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై హిందూసేన దాడికి నిరసన

#mimnarasaraopet

హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ న్యూఢిల్లీ అధికారిక నివాసం పై హిందూ సేన దాడిని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో హిందూ సేన దిష్టి బొమ్మ దహనం చేశారు.

ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ హిందూ సేన కార్యకర్తలు చేసిన రాళ్ళ దాడి దేశ రాజ్యాంగం పై దాడి అని అన్నారు. దేశం నలుమూలలా ఎక్కడ దళిత ఆదివాసీ మైనారిటీ బీసీ లపై అన్యాయం జరిగినా ముందుగా పార్లమెంట్ లో మాట్లాడే ఏకైక వ్యక్తి అసదుద్దీన్ అని ఆయన తెలిపారు.

దేశ రాజకీయ నాయకులలో అవినీతి మచ్చ లేని నాయకుడు అయిన అసదుద్దీన్ నివాసంపై దాడి చేయటం దారుణం అని ఆయన అన్నారు. త్వరలో కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాలలో వున్న బీజేపీ ప్రభుత్వ పతనం ఖాయం అని తెలిపారు. హిందూ సేనపై FIR నమోదు చేసి కఠినంగా శిక్షించాలని 7సంవత్సరాల లో మూడవ సారి దాడి చేయటం శోచనీయమని ఆయన అన్నారు.

ఇలాంటి మాత సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి పట్టణ అధ్యక్షులు మౌలాలి, జిల్లా అధ్యక్షులు కరీముల్లా మసూద్ నాసర్ వలి బీసీ నాయకులు ఉదయగిరి వెంకటస్వామి, అన్నం మస్తాన్ వలి, మైనారిటీ నాయకులు రఫీ, వజీర్ అయూబ్, బాషా కరీం,సలీమ్ భాయ్,,బడే బాబు, గఫార్, జక్రియా, రఫీ, మునాఫ్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మావోలూ మీరంతా లొంగిపోతేనే మేలు

Satyam NEWS

దళిత బంధు కాదు ఇది.. టీఆర్ఎస్ ధనవంతుల బంధువు

Satyam NEWS

రాజధాని విశాఖ లో ఇక విజయసాయి రెడ్డిదే హవా

Satyam NEWS

Leave a Comment