28.7 C
Hyderabad
May 6, 2024 00: 33 AM
Slider కరీంనగర్

మంత్రి కొప్పుల సమీక్షంలో తెరాస పార్టీ లోకి భారీ చేరికలు

75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి చూస్తున్నామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో గ్రామ యువకులు మూడు వందల మంది కొప్పుల అన్విక్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బుధవారం నాడు తెరాస పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పనితీరు చూస్తుంటే దొంగలు దొంగలు దొంగే అన్నట్టు ఉందని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కునిచేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

మొన్నటికి మొన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న కుట్రలు బట్ట బయలు కావడంతో ఇక్కడి బీజేపీ నేతల్లో వణుకు పట్టుకుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం తిసుకు వచ్చారు. రాజగోపాల్ రెడ్డి ని బిజెపి పార్టీ బలి పశువు చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.

కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, లేనిది ఉన్నట్టు చూపిస్తూ భ్యపెడుతుందాని, నిరుపేదలకు విద్యా వైద్య సౌకర్యాలను దూరం చేస్తుందన్నారు. యువత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన ఉద్యోగాలు ఏమయ్యా యాని బీజేపీ నేతలను యువత నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టి విక్రయిస్తున్నారని చెప్పారు. 8 లక్ష ల 50 వేళా ఉద్యోగాలు కొల్ల గొట్టారని మంత్రి కొప్పుల మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎందరో ఆకర్షితులు అవుతున్నారు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి నెంబరు వన్ పొజిషన్ కు చేరుకుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అంతకు ముందు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

Related posts

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు రెండో సారి కోవిడ్

Satyam NEWS

ఉత్తరాఖండ్ లో తల్లీ కూతురిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

ఫోటో ఉంది : 14పీహెచ్ : పువ్వాడ పొలిటికల్ లెజెండ్

Bhavani

Leave a Comment