21.7 C
Hyderabad
December 2, 2023 04: 28 AM
Slider ఖమ్మం

ఫోటో ఉంది : 14పీహెచ్ : పువ్వాడ పొలిటికల్ లెజెండ్

#political legend

ఖమ్మం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా, సుదీర్ఘ కాలం చట్ట సభల్లో ప్రాతినిథ్యం పొందిన వ్యక్తిగా పువ్వాడ నాగేశ్వరరావు పొలిటికల్ లెజెండ్ అని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. పువ్వాడ 85వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి పువ్వాడ తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యను చీలిక సమయంలో నామ మాత్రంగా మిగిలిన సిపిఐని బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో అత్యంత అసమర్ధవంతంగా వ్యవహరించారన్నారు. పువ్వాడ జీవితం మొత్తం పోరాటమేనని ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులలో సైతం ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు.

చట్ట సభలలో పదునైన మాటలతో ప్రభుత్వాన్ని అనిలదీసే వారని ప్రజా సమస్యలను ప్రస్థావించడంతో పాటు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేవారన్నారు. శ్రీనివాసరెడ్డి వెంట టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.

రాంనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సర్వనేని వెండట్రావు, మాబేటి వేణుగోపాల్, సామినేని కృష్ణ మురారి, ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, జిల్లా నాయకులు పాపారావు, శ్రీనివాస్, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కె. ప్రసాద్, మోహినుద్దీన్, మురళి, దువ్వా సాగర్, కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోటపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి

Bhavani

హోం మంత్రి మహమూద్ అలీకి పాజిటీవ్

Satyam NEWS

సిమెంట్ పరిశ్రమ కార్మికులకు 8వ ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!