33.2 C
Hyderabad
May 15, 2024 13: 46 PM
Slider మహబూబ్ నగర్

“జూపల్లి ఉద్యమ” క్యాలెండర్ ఆవిష్కరణ

#Jupalli Krishna Rao

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్రను గుర్తు చేస్తూ “జూపల్లి ఉద్యమ” క్యాలెండర్ ను రూపొందించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులకు సంబంధించిన తాళ్ళ నరసింహాపూర్ గ్రామంలో “జూపల్లి ఉద్యమ” క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ ఆదేశాల మేరకు వంగ రాజశేఖర్ గౌడ్ యూత్ క్యాలెండర్ పంపిణీ చేసింది.

వివిధ పార్టీల నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక జూపల్లి పై చేస్తున్న వివిధ అసత్య ఆరోపణలకు దీటుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాక్షేత్రంలో నే క్యాలెండర్ రూపంలో విమర్శకులకు సమాధానం ఇచ్చారు. జూపల్లి పై సోషల్ మీడియా లో అసభ్య పదజాలంతో,అసత్య ఆరోపణలు చేస్తూ కొందరు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆ ఆరోపణలకు క్యాలెండర్ రూపంలో సమాధానం చెప్పినట్లు అయింది.

ఆనాడు విద్యుత్ అధిక చార్జీలపై పోరాటం చేసి జైల్ కి వెళ్ళిన జూపల్లి పోరాటాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల ఆత్మబలిదానాలు చూసి చలించలేక మంత్రి పదవికి, అధికార పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేసిన సంఘటనలను గుర్తు చేస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వైనాన్ని క్యాలెండర్ రూపంలో ప్రజల ముందు ఉంచారు.

Related posts

పశువుల్లో లంపి చర్మ వ్యాధిపై ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసు

Satyam NEWS

భీమ్ ఆర్మీతో జత కట్టేందుకు అఖిలేష్ నో

Satyam NEWS

కోడెల మరణంపై కమ్ముకున్న అనుమాన మేఘాలు

Satyam NEWS

Leave a Comment