36.2 C
Hyderabad
May 15, 2024 17: 08 PM
Slider నెల్లూరు

వి యస్ యు లో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

#Vikram University

నెల్లూరు జిల్లా వి ఎస్ యు లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఆవిష్కరించారు.

తదనంతరం ఆయన మాట్లాడూతూ 75 సంవత్సరాల క్రితం మహనీయులు చేసిన త్యాగాలను బలిదానాలు గురించి జ్ఞాపకం చేశారు. 

గడచిన 75 సంవత్సరాలలో దేశం ఎంతో వ్యప్రయాసలకు ఓర్చి ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. ఒలిపిక్స్ లో మన దేశ క్రీడాకారులు సాధించిన పథకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. 

విద్యార్థులందరూ కూడా దేశ  ప్రగతికి పాటుపడాలని కోరారు. విద్య సామాన్యులు అందరికి అందుబాటులో వుండాలని ఆకాంక్షించి ఎంతో కష్టపడి డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించటం జరిగిందన్నారు.

అలాగే కోవిడ్ వలన ఆర్ధిక భారం వున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్మోహన్ రెడ్డి కూడా విద్య, వైద్య రంగాలలో పెను మార్పులకు శ్రీకారం చుట్టి పురోగతిని సాధించారని అన్నారు. 

కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఆవరణంలో మొక్కలు నాటి అందరూ పచ్చదనాన్ని పెంచేందుకు కృషిచేయాలని సూచప్రాయంగా తెలిపారు. చివరిగా కోవిడ్ 19 సమయంలో అలాగే యూనివర్సిటీ హెర్బల్ గార్డెన్ లో శ్రమదానం చేసిన  ఎన్ యస్ యస్ వాలంటీర్లు కు ప్రశంస పత్రాన్ని రెక్టార్ ఆచార్య ఎం. చంద్రయ్య చేతుల మీదుగా అందచేశారు.

ఈ కార్యక్రమంలో  రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి, ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు,ఎన్ సి సి క్యాడ్డెట్స్, ఎన్ యస్ యస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

కడప జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !

Satyam NEWS

శ్రీకాకుళం లో ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు

Satyam NEWS

Leave a Comment