31.7 C
Hyderabad
May 2, 2024 09: 22 AM
Slider ప్రత్యేకం

దళిత విద్యార్ధి నల్లపు రమ్య హత్య అతి దారుణం

#mala mahanadu

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో స్వతంత్ర దినోత్సవం రోజే పట్టపగలు ఇంజనీరింగ్ చదువుతున్న దళిత విద్యార్థిని నల్లపు రమ్య ను కత్తితో పొడిచి హత్య చేయడం దారుణమని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య అన్నారు.

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జిల్లా కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య హాజరయ్యారు.

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. రమ్య ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఉన్మాదిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా బాధిత కుటుంబానికి మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బాలరాజ్,రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది  బాలరాజ్,పట్టణ అధ్యక్షులు గోకమాల అంజయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు సాతర్ల శివకుమార్, హన్వాడ మండల అధికార ప్రతినిధి తోళ్ల మాసయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

అంబర్ పేట్ లో వైభవంగా మహాపడిపూజ

Satyam NEWS

మద్యం మత్తులో అన్న ను కత్తితో పొడిచిన తమ్ముడు

Satyam NEWS

Leave a Comment