38.2 C
Hyderabad
May 3, 2024 22: 57 PM
Slider రంగారెడ్డి

ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి విభాగం ప్రారంభo

#cbit

సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి విభాగాన్ని సిబిఐటి నేడు ప్రారంభించింది. ఈ సందర్భంగా అల్ట్రాటెక్ సిమెంట్ సహకారంతో “ఆధునిక కాంక్రీట్ మరియు రెట్రోఫిట్టింగ్ టెక్నిక్‌లు”పై  కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబిఐటి  కళాశాల ప్రిన్సిపాల్  ప్రొఫెసర్ పి.రవీందర్ రెడ్డి  స్వాగతోపన్యాసం చేసారు  మరియు విద్యార్థుల కావసిన నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలి అనే అంశాన్ని వివరించారు.

ప్రొఫెసర్ కె.జగన్నాధరావు తన ప్రసంగంలో పరిశోధన మరియు కన్సల్టెన్సీలో విభాగం కార్యకలాపాలను వివరించారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఈ రకమైన కార్యక్రమాల ప్రాముఖ్యతను కూడా ఆయన తెలియజేశారు. ICI విద్యార్థి చాప్టర్ కోఆర్డినేటర్ డాక్టర్ K శ్రీకాంత్ నేటి నిర్మాణ అభివృద్ధిలో ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

ఈ వర్క్‌షాప్ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ సంస్థల నుండి 130 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులు ప్రసంగించారు.  అల్ట్రాటెక్ సిమెంట్  కంట్రోల్ హెడ్-అల్ట్రాటెక్ రెడీ మిక్స్‌ మెహర్ రాజేంద్ర, తెలంగాణాలో అల్ట్రాటెక్ సిమెంట్ ప్రాంతీయ హెడ్ టెక్నికల్ సర్వీసెస్ ఎన్. శ్రీనివాస్ రావు, ఎన్విఎల్ఎన్  కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నుండి ఐశ్వర్య గుప్తా మాట్లాడారు. ముగింపు కార్యక్రమంలో  కాంక్రీట్ క్షీణత కారణాలు, కాంక్రీటు నిర్మాణాల క్షీణత, పటిష్ట పద్ధతుల అవలోకనం గురించి వక్తలు తమ అనుభవాలను, పరిజ్ఞానాన్ని విద్యార్థులలో పంచుకున్నారు.

Related posts

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పని చెయ్యాలి

Satyam NEWS

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor

Leave a Comment