41.2 C
Hyderabad
May 4, 2024 16: 53 PM
Slider ఖమ్మం

ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు

#Kanti Velam camp

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించేందుకు, నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్, కంటి పరీక్షల నిర్వహణ, శిబిరాన్ని ఎప్పుడు ప్రారంభించింది, ఎన్ని రోజులు చేపట్టనున్నది, రోజుకు ఎంత మంది కి పరీక్షలు చేస్తున్నది అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించికొని, ప్రభుత్వంచే చేపట్టబడిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

జిల్లాలో 55 కంటి వెలుగు బృందాలు ఏర్పాటుచేసి, షెడ్యూల్ కై సూక్ష్మ ప్రణాళిక చేపట్టి కార్యక్రమ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. జనవరి 18 న ప్రారంభించిన కార్యక్రమం 100 పని దినాల పాటు కొనసాగుతుందన్నారు. జిల్లాలో 63 గ్రామ పంచాయతీలు, 21 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తిచేసినట్లు, 43 గ్రామ పంచాయతీల్లో, 13 వార్డుల్లో

పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. 1,15,734 మందికి కంటి పరీక్షలు చేపట్టినట్లు, ఇందులో 55,689 మంది పురుషులు, 59,765 మంది స్త్రీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అవసరం 29,282 మందికి పరీక్షల వెంటనే రీడింగ్ కళ్ళద్దాలు ఆందజేసినట్లు, 17, 917 మందికి ప్రిస్కిప్షన్ కళ్ళద్దాల కొరకు ఆర్డర్ చేసినట్లు ఆయన అన్నారు.

ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ కట్టలమ్మ చెరువును పరిశీలించారు. చెరువును అభివృద్ధి పరిచి, సుందరీకరణ కు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులో తుంగ, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. బండ్ వెంబడి మొక్కలు నాటాలన్నారు.

రహదారిపై మీడియంలలో మొక్కలు నాటాలన్నారు. పందుల తరలింపుకు చర్యలు తీసుకోవాలని, పందుల పెంపకందార్లకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.

Related posts

ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

Bhavani

విజయనగరంలో లాక్డ్ హౌసెస్ పై నిఘాకు శ్రీకారం

Satyam NEWS

రాష్ట్ర స్థాయీ క‌బ‌డ్డీ పోటీల‌కు క్రీడాకారులు ఎంపిక‌…!

Satyam NEWS

Leave a Comment