31.7 C
Hyderabad
May 2, 2024 08: 43 AM
Slider విజయనగరం

విజయనగరం లో శిల్పా రామంకు బస్సు..

#shilparamam

ఈ నెల 3 న గులాబీ, నర్సరీల విక్రయాలు..!

విజయనగరం జిల్లా కేంద్రంలో ఇటీవలే నగర శివారు.. వ్యాసనారాయణ మెట్ట వద్ద కొత్త ఏర్పాటు చేసిన శిల్పారామం ప్రజల ముందుకు వచ్చింది. అయితే శిల్పారామం ప్రారంభం నుంచీ అంత దూరాన పర్యాటకలు…ఆహ్లాదం కోసం వెళ్లే వారు..చాలా దూరమనిపించి…అంతగా వెళ్లేందుకు శ్రధ్ధ ఆసక్తి చూపటం లేదు. దీన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి శిల్పారామం కు ఆర్టీసీ బస్సు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం మూడవ తేదీన ఆ ఆర్టీసీ బస్సు సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ పూల్ బాగ్ శిల్పారామం కు చేరుకుంటుంది .మళ్లీ రాత్రి ఎనిమిది గంటలకు.. అక్కడ నుంచీ బయలుదేరి ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుంటుంది.

ఈ మేరకు స్థానిక బాబామెట్ట నల్లచెరువు సమీపంలోని శిల్పారామంలో ఈ నెల 3 వ తేదీ, ఆదివారం  నర్సరీ ,గులాబీల ప్రదర్శనను నిర్వ‌హిస్తున్న‌ట్లు, జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి తెలిపారు.  ఈ ప్రదర్శన ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల పండ్ల, పూల మొక్కలు, గులాబీల ప్రదర్శన తో పాటు, ఇండోర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు.

ప్రదర్శన తో బాటు విక్రయాలు కూడా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎప్పటిలాగే సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిల్పారామం చేరుకోవడానికి ఆరోజు బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరి, కోట జంక్షన్, దాసన్నపేట రైతు బజార్ మీదుగా శిల్పారామం చేరుకుంటుందని తెలిపారు.

Related posts

18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదుకు ప్రత్యేక డ్రైవ్

Bhavani

భ‌వ‌న‌, సంక్షేమ నిధి అమ‌లుపై సిఐటీయూ 17న మంత్రుల ఇళ్ల ముట్ట‌డి

Sub Editor

గర్భిణీ స్త్రీలపై అంగన్వాడీ టీచర్లు తీసుకుంటున్న శ్రద్ధ తల్లి ప్రేమను తలపిస్తుంది

Satyam NEWS

Leave a Comment