37.2 C
Hyderabad
May 2, 2024 13: 25 PM
Slider హైదరాబాద్

దారుణమైన పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ మహానగరం

#HyderabadFloods

హైదరాబాద్ లో భారీ వర్షాలు వరదల కారణంగా కొట్టుకుపోవడంతో అనేక రోడ్లు మూతపడ్డాయి. అవి: బెంగళూరు హైవే ను మూసేశారు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో ట్రాఫిక్ ను నిలిపివేశారు.

ఉప్పల్ ఎల్ బి నగర్ మధ్య ఉన్న రోడ్డును మూసేశారు. దిల్ సుఖ్ నగర్ నుంచి కోటీ వెళ్లే రోడ్ ను బంద్ చేశారు. బేగంపేట్ మొత్తం దాదాపుగా మునిగిపోయి ఉంది.

నిజాంపేట్ లోని బండారి లేఅవుట్ మొత్తం మునిగిపోయింది. మెహిదీపట్నం నుంచి హైటెక్ సిటీ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం లో రాకపోకలు నిలిపివేశారు.

కూకట్ పల్లిలోని ఐడిపిఎల్ చెరువు, హఫీజ్ పేట్ చెరువు పూర్తిగా నిండిపోయి నీళ్లు బయటకు పొంగుతున్నాయి. మూసీ నదికి వరదలు రావడంతో గేట్లు ఎత్తేశారు.

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేశారు. హెచ్ సి యు వైపు గచ్చిబౌలి మొత్తం నీటిలో మునిగిపోయింది.

సోమాజి గూడా గ్రీన్ లాండ్స్, పంజాగుట్ట, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే, మెహిదీపట్నం, టోలీ చౌకీ మొత్తం మునిగిపోయి ఉన్నాయి.

అశోక్ నగర్ హిమాయత్ నగర్, ముషీరాబాద్ ప్రాంతాలలోకి హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తడంతో నీళ్లు వస్తున్నాయి.

Related posts

9న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఆందోళన జయప్రదం చేయండి

Satyam NEWS

ఘనంగా జరిగిన తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

అక్రమాల ఏకగ్రీవాల పై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS

Leave a Comment