27.7 C
Hyderabad
May 15, 2024 04: 53 AM
Slider ఖమ్మం

ఈ నెల 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

#Collector Anudeep

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగుతున్న మహోత్సవాల్లో భాగంగా ఈ నెల6వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని విజయ వంతం

చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ వేడుకలు నిర్వహణకు సమన్వయం చేసే భాధ్యతను జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సీతారాం ను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించాలని చెప్పారు.

ఈ సభలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావానికి 2014 సంవత్సరానికి ముందు 2014 తరువాత పరిశ్రమలు ఏర్పాటుకు అనుమతులు జారీ, ప్రక్రియ సులభతరం చేసిన విధానం, పరిశ్రమలు స్థాపనకు టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన సత్వర అనుమతులు, సులభతరమైన

విషయాన్ని తెలియచేయాలని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వెల్లువకు సంబంధించిన వివరాలు తద్వారా పెరిగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల వివరాలను ప్రకటించాలని చెప్పారు. విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై కర పత్రాలు పంచాలని చెప్పారు.

టి హబ్, వి హబ్ లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహించాలని చెప్పారు.ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్, బెంగళూరును అదిగమించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన తీరును ఆవిష్కరించాలని చెప్పారు.

Related posts

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

Thanks to CM: ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ

Satyam NEWS

లాక్ డౌన్: తల్లి మరణించినా కనికరించని పోలీసులు

Satyam NEWS

Leave a Comment