40.2 C
Hyderabad
May 1, 2024 18: 46 PM
Slider నెల్లూరు

టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుంది

#adala

పొరపాటున తెలుగుదేశం పార్టీ గనుక అధికారంలోకి వస్తే ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త వెల్లంటి, పాత వెల్లంటిలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశాల్లో డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎంపీ ఆదాల మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న సంక్షేమం  లేదన్నారు. టిడిపి హయాంతో ఇప్పటి సంక్షేమాన్ని గమనిస్తే తేడాను ఏమిటో అర్థమవుతుందని పేర్కొన్నారు.  స్థానిక సమస్యల పరిష్కారానికి జెడ్పి నిధులు, ఎంపీ నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చాక ఎన్నో సమస్యలకు స్థానిక పరిష్కారం దొరికిందని తెలిపారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడమే ఈ ఆత్మీయ సమావేశాల ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ,రూరల్ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్, స్థానిక సర్పంచులు లక్ష్మమ్మ, రాధమ్మ, రవీందర్ రెడ్డి, రాంగోపాల్, దేవ సేనమ్మ, కోటేశ్వర్రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి, చెంచయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, తాటిపర్తి వెంకటేష్, ఆర్.ఎస్.ఆర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిలో ముఖ్యభాగం

Satyam NEWS

పరాయివారిపై ప్రేమ మన దేశం వారిపై చిన్న చూపు

Satyam NEWS

ఉప్పల్ సమస్యలు పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment