38.2 C
Hyderabad
May 2, 2024 21: 04 PM
Slider ప్రపంచం

కరోనా యాంటీ బాడీలతో పుట్టిన సింగపూర్ బిడ్డ

#Infant

గర్భిణి స్త్రీకి కరోనా సోకితే పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా సోకుతుందని ఇంత కాలం అనుకున్నదానికి భిన్నంగా సింగపూర్ లో జరిగింది.

కరోనా సోకిన గర్భవతి ప్రసవించిన అనంతరం ఆమె బిడ్డకు కరోనా సోకలేదు. అంతే కాదు. ఆ బిడ్డలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ఉన్నాయి.

ఈ యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ఉండటంతో ఆ బిడ్డ కరోనా లేకపోయినా యాంటీ బాడీలు అభివృద్ధి పరచుకున్నట్లు వెల్లడి అయింది.

ఈ సంఘటనకు సంబంధించి సింగపూర్ వైద్యులు, శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా ఆ మగబిడ్డ కు యాంటీ బాడీలు అభివృద్ధి చెందడం ఎలా సంభవించిందో వారు పరిశోధన చేస్తున్నారు.

తల్లి గర్భంలో ఉండగానే కరోనా వ్యాధి సోకి పోయిందా? అందుకే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని సింగపూర్ లోని కెకె ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ తాన్ హాక్ కూన్ తెలిపారు.

 గర్భవతులకు కరోనా సోకితే బిడ్డకు ప్రమాదం వాటిల్లుతుందని ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అయితే అది తప్పు అని సింగపూర్ లో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తున్నది.

Related posts

Amazon Seller Accounting Software Integration- Bookkeep

Bhavani

అతి శీతల ప్రదేశంలో హృదయవిదారక మరణం

Satyam NEWS

మయన్మార్ నేత సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష

Sub Editor

Leave a Comment