38.2 C
Hyderabad
May 3, 2024 20: 42 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట

#ktr

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్ది అంతకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన  అవసరం ఉందని, భావి తరాల వారికి ఎలాంటి  సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పరిపాలన  పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎల్ బి నగర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఎస్.ఆర్.డి.పి కార్యక్రమం ద్వారా 143.58 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నీ మంత్రి ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర కార్మిక ,ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ శాసన సభ్యుడు  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్  శ్రీనివాస్ గుప్తా,  జనార్ధన్ రెడ్డి,  డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్  డి ఎస్ లోకేష్ కుమార్, సి ఇ దేవానంద్ యస్ సి రవీందర్ రాజు,  కార్పొరేటర్  అరుణ, పవన్ కుమార్, జోనల్ కమిషనర్ పంకజ ఎస్ సి అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ లు ఇ ఇ లు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి  కె. టి ఆర్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్.ఆర్.డి.పి కార్యక్రమాన్ని రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయని అన్నారు. 

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేటివి ఇప్పుడు అవి తగ్గిపోయావని గుర్తు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తామని తెలిపారు. ఎల్బీనగర్ ప్రాంతంలో రూ. 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశామని అన్నారు. 

హైదరాబాద్ నగరం భారత దేశంలో శరవేగంగా ఎదుగుతున్న నగరమని, భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హరితహారంలో మనం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రపంచంలోనే చాలా నగరాలను వెనక్కి నెట్టి వరల్డ్ గ్రీన్ సిటీ గా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందని గుర్తు చమౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి పట్టాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు. రెండు మూడు రోజుల్లో జీవో ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖ లైన  హెచ్.ఎం.డి.ఏ, ఆర్ అండ్ బి, నేషనల్ హై వే ద్వారా  మొత్తం 47 పనులు చేపట్టారు. ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు. పూర్తయిన 31 పనులలో 15 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్.ఓ.బి లు / ఆర్.యు.బి లు, 1 కేబుల్  స్టాయెడ్ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట వైడెనింగ్,  ఒకటి ఓ.ఆర్.ఆర్ నుండి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.

వరద ముంపు నివారణకు ఎస్.ఎన్.డి.పి ద్వారా రూ. 113 కోట్ల వ్యయంతో 11 పనులను చేపట్టగా అందులో 3 పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగతా 8 పనులు సాధ్యమైనంత వరకు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. 

రాజకీయాలు ఎన్నికల సందర్భంలోనే ఉండాలని, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలు ఏవైనా అందరూ కలిసికట్టుగా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అన్నారు. ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని, రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతున్నందున ప్రణాళిక బద్దంగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతున్నదని, ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించేందుకు ఫ్లైఓవర్ ను, అండర్ పాస్ లను నిర్మిస్తున్నట్లు, ఎల్బీనగర్  ప్రాంతంలో గతంలో ఉప్పల్ నుండి ఎల్బీనగర్ చేరడానికి 45 నిమిషాలు పట్టేదని, ఫ్లైఓవర్ వలన ఇబ్బందులు తొలిగిపోయాయని అన్నారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా 113 కోట్లతో నాలా అభివృద్ది పనులు చేపడుతున్నట్లు, తద్వారా రాబోయే రోజుల్లో వరద ముంపు ఉండదని, ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్

Satyam NEWS

ముస్తాబవుతున్న ఆదర్శ రైల్వే స్టేషన్లు

Bhavani

ఆరుగాలం కష్టించిన అన్నదాత ప్రతిఫలంపై మొద్దునిద్రలో కేంద్రం

Satyam NEWS

Leave a Comment