27.7 C
Hyderabad
April 30, 2024 10: 20 AM
Slider ముఖ్యంశాలు

ముస్తాబవుతున్న ఆదర్శ రైల్వే స్టేషన్లు

#Adarsh Railway Stations

ప్రయాణికులకు సౌకర్యాలు పెంచడం లక్ష్యంగా మంజూరుచేసిన ఆదర్శ రైల్వేస్టేషన్ల డిజైన్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 39 ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ఎంపికయ్యాయి. మరికొద్దివారాల్లో రాష్ట్రంలోని మరో 32 స్టేషన్లనూ ఈ పథకంలో ఎంపిక చేయనున్నారు. పార్కింగ్‌కు విశాలమైన స్థలంతో పాటు హైదరాబాద్‌లోని స్టేషన్లలో సిటీ బస్సుల, రైళ్ల ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా డిజైన్లు తయారు చేస్తున్నట్లు రైల్వేవర్గాలు తెలిపాయి.

ఆదిలాబాద్‌, బాసర, కాచిగూడ, మల్కాజిగిరి, బేగంపేట, భద్రాచలం రోడ్‌, గద్వాల, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మలక్‌పేట, మంచిర్యాల, మేడ్చల్‌, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్‌,

షాద్‌నగర్‌, జోగులాంబ, తాండూరు, ఉందానగర్‌, వికారాబాద్‌, వరంగల్‌, రాయగిరి, యాకుత్‌పురా, జహీరాబాద్‌, జడ్చర్ల వున్నాయి. ఆదర్శ స్టేషన్‌ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారేలా సౌకర్యాలు కల్పించబోతున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది.

Related posts

దిశ జాగృతి యాత్ర: ప్ర‌లోభాల‌కు..వ్యామోహాల‌కు ప‌డి పోకండి…!

Satyam NEWS

ఎమ్మెల్యే క్రాంతిని సన్మానించిన టీయూడబ్ల్యూజే

Satyam NEWS

కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అరికట్టాలి

Satyam NEWS

Leave a Comment