33.2 C
Hyderabad
May 14, 2024 12: 43 PM
Slider ముఖ్యంశాలు

ఆరుగాలం కష్టించిన అన్నదాత ప్రతిఫలంపై మొద్దునిద్రలో కేంద్రం

#gangula

రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరుభయట తడిసి ముద్దవుతుంది, ఈ ధాన్యం మరో పదిరోజుల్లో పూర్తిగా పాడయిపోయే పరిస్థితులు నెలకొన్నందున వాటిని టెండర్ ద్వారా విక్రయించే ప్రతిపాధనలను ముఖ్యమంత్రికి సమర్పించే అంశంపై నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

గత నెల 7వ తారీఖునుండి కుంటి సాకులతో ఎప్.సి.ఐ రాష్ట్రం నుండి సీఎంఆర్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే, తెలంగాణా రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యంపై తన మొద్దు నిద్రను, బాధ్యతారాహిత్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం వద్ద ఉన్న 2020-21 యాసంగి, 2021-22 వానాకాలం, యాసంగి ధాన్యం కలిపి దాదాపు 94 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉంది.

సీఎంఆర్ ప్రక్రియను పున:ప్రారంభించాల్సిందిగా ఎప్.సి.ఐ అధికారులకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ శాఖ  పదే పదే చేస్తున్న విజ్ణాపనలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, విపరీతమైన వర్షాలతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మరో వారం పదిరోజుల్లో పాడై పోయే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ధాన్యాన్ని టెండర్ ద్వారా విక్రయించాలనే ప్రతిపాదనలపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేధిక సమర్పించాలని మంత్రి గంగుల నిర్ణయించారు,

టెండర్ల విధివిదానాలు, ఎప్.సి.ఐ వైఖరి, రాష్ట్ర పీడీఎస్ అవసరాలపై మంత్రి గంగుల ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు, తక్కువ నష్టంతో ఈ సమస్యనుండి ఎలా బయటపడాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ రుక్మిణీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ జీఎం రాజారెడ్డి, మిల్లర్ల సంఘం అధ్యక్షులు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దక్షిణాది రాష్ట్రాలలో ఎటాక్ జరగవచ్చు జాగ్రత్త

Satyam NEWS

చిన్నారి సేఫ్

Bhavani

వ్యాక్సిన్ వచ్చింది సరే…మనకు అందేది ఎలా?

Satyam NEWS

Leave a Comment