37.2 C
Hyderabad
May 6, 2024 22: 51 PM
Slider ముఖ్యంశాలు

అంబర్ పేట్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం

అంబర్ పేట నియోజకవర్గ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ బుదవారం స్థానిక అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అంబర్ పేట శ్రీ రమణ జంక్షన్ నుంచి అలీ కేఫ్ జంక్షన్ వరకు 9 కోట్ల 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్ పేట శ్రీరమణ జంక్షన్ నుంచి అలీ కేఫ్ జంక్షన్ వరకు పూర్తిగా రూపురేఖలు మార్చేందుకు రంగం సిద్ధం చేశామని ఇందుకు సంబంధించి 9 కోట్ల 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమవుతున్నాయని, మంత్రి కేటీఆర్ సహకారంతో వివిధ ట్రాఫిక్ జంక్షన్ల డివైడర్ల సుందరీకరణ పనులు కోసం 6 కోట్ల రూపాయలు, 2 కోట్ల 30 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ పనులు,1 కోటి 60 లక్షల వ్యయంతో గ్రీనరీ పనులు ప్రారంభిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ శంకర్, డిఈ సుధాకర్, డిఈ సువర్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మైనార్టీ నాయకులు, అనుబంధ సంస్థ సభ్యులు, స్థానిక బస్తీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

సూర్యాపేట బిజెపిలో కొత్త నేతల సందడి

Satyam NEWS

“మన బస్తీ- మన బడి” కార్యక్రమం పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడండి

Satyam NEWS

తెలంగాణ ద్రోహులను మోస్తున్న కాంగ్రెస్ బీజేపీ

Bhavani

Leave a Comment