33.2 C
Hyderabad
May 11, 2024 14: 33 PM
Slider ఖమ్మం

గృహ వినియోగ వస్తువుల పంపిణీ తనిఖీ

#household goods

మున్నేరు వరద బాధితులకు ఐటీసీ వారి సహకారంతో గృహ వినియోగ వస్తువుల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ఖమ్మం అర్బన్ పరిధిలో 1893, ఖమ్మం రూరల్ పరిధిలో 571 బాధిత కుటుంబాలను గుర్తించినట్లు ఆయన అన్నారు. వరద బాధిత ప్రాంతాల వారిగా కౌంటర్లు ఏర్పాటుచేసి, పంపిణీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

నష్టపోయిన ప్రతి కుటుంబానికి వస్తువుల పంపిణీకి టోకెన్ లు జారిచేసినట్లు, టోకెన్ లు చూపి, వస్తువులు తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి అందే వరకు వస్తువుల పంపిణీ జరుగుతుందని, ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఖమ్మం అర్బన్, రూరల్ తహశీల్దార్లు సిహెచ్. స్వామి, రామకృష్ణ, అధికారులు, తదితరులు ఉన్నారు.

Related posts

చట్ట సవరణ: ఏపిలో రేప్ చేస్తే మరణశిక్షే

Satyam NEWS

సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పోరాటం

Satyam NEWS

విశ్వ‌క‌ర్మ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌మిటీ

Satyam NEWS

Leave a Comment