39.2 C
Hyderabad
April 28, 2024 12: 14 PM
Slider ముఖ్యంశాలు

సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పోరాటం

#PCC President Uttamkumar Reddy 1

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాల) పోరాటం చేయాలని టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం 28వ తేదీ గురువారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, యూ ట్యూబ్ ల వేదికగా ఎవరికి వారే స్వయంగా మాట్లాడి ఆ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేయాలని ఆయన కోరారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించి ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని ఆయన కోరారు. ఇందుకోసం నాలుగు ప్రధానాంశాలు ఎంపిక చేశారు.

అవి: 1. దేశంలోని ఆదాయ పన్ను పరిధిలోకి రాని ప్రతి పేద కుటుంబానికి లాక్ డౌన్ పరిహారంగా వెంటనే రూ.10 వేలు నేరుగా అందించాలి.

2. దేశంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, కార్మికులకు, రైతులకు, దినసరి వేతన దారులకు, మత్స్య కార్మికులకు ఆర్థిక తోడ్పాటు అందించాలి.

3. దేశంలో లక్డౌన్ వల్ల చాలా కష్టాలు అనుభవిస్తున్న కోట్లాది మంది వలస కార్మికులను ఉచిత రవాణాతో భద్రంగా వాళ్ళ ఇళ్లకు చేర్చాలి.

4.దేశంలోని పేదలకు నెలకు 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు ప్రభుత్వం అందించి ఆదుకోవాలి.

ఈ అంశాలపై పెద్దఎత్తున ఆన్లైన్ పోరాటం చేసి దేశంలోని కోట్లాది మంది పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ నిలబడాలని పిలుపునిచ్చారు.

Related posts

దాడుల నుంచి జర్నలిస్టులకు లోకేష్ భరోసా

Satyam NEWS

తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కర్తవ్యం

Satyam NEWS

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

Leave a Comment