31.2 C
Hyderabad
May 3, 2024 00: 50 AM
Slider ప్రత్యేకం

పొలిటికల్ కార్నర్: పాపం విజయసాయిరెడ్డి

#MP Vijayasaireddy

వైసీపీలో అన్నీ తానై వ్యవహరించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పట్నంలో జరిగిన విషవాయువు లీకేజి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో విజయసాయి రెడ్డికి ఈ అవమానం జరిగింది.

ముఖ్యమంత్రి తన నివాసం నుంచి వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో విజయసాయి రెడ్డి సిఎం కన్నా ముందుగానే కారు ఎక్కి కూర్చున్నారు. విజయసాయి రెడ్డి కూర్చున్న తర్వాత సెక్యూరిటీ అధికారి కూడా కారు ఎక్కి కూర్చుని డోర్ వేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని కారు బయటే ఉండిపోయారు.

 ముఖ్యమంత్రి కారులో కూర్చున్న తర్వాత ఆరోగ్య మంత్రితో మాట్లాడుతున్నారు. అయితే వెంటనే విజయసాయి రెడ్డిని కారులో నుంచి దిగాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయసాయి రెడ్డి కారులోని దిగగానే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కారులో ఎక్కమని సిఎం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడం ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి కూడా కారు ఎక్కగానే బయలుదేరి వెళ్లిపోయారు. వి జయసాయిరెడ్డి పాపం అక్కడే మిగిలి పోయారు. విశాఖ పట్నంలో చాలా కాలంగా క్యాంపు వేసి ఉన్న విజయసాయి రెడ్డి విశాఖ పట్నం కష్టంలో ఉన్నప్పుడు వెళ్లలేకపోవడం అదీ ముఖ్యమంత్రి కారు దహించేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Related posts

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS

ఏపిలో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం

Satyam NEWS

చిరు చినుకుల మధ్యనే విజయనగరం ఎస్ పి విధినిర్వహణ

Satyam NEWS

Leave a Comment