26.7 C
Hyderabad
May 12, 2024 07: 50 AM
Slider ముఖ్యంశాలు

యాదాద్రి సహా 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు

#International awards

తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. యాదాద్రి ఆలయం సహా 5 భవనాలకు ‘ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌’ అవార్డులు దక్కాయి. లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ఈ అవార్డులను ప్రకటించింది.

అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూం, మొజాంజాహీ మార్కెట్‌ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కడం విశేషం.

లండన్‌లో ఈ నెల 16న గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డులను అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అవార్డులను అందుకోనున్నారు.

Related posts

రేప్:తాత మేనమామలే కామాందులై యువతిని చెరుస్తూ

Satyam NEWS

ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చాలి

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో.. డీఎస్పీ ఆధ్వర్యంలో “స్పందన”…!

Bhavani

Leave a Comment