మానవ సంబందాలు మంటకలిసి పోతున్నాయి.ఆపదలో ఉన్నామని ఆదరిస్తారని వచ్చిన ఆ మహిళకు ఆప్తులే నరకం చూపించారు. స్వంత అమ్మమ్మ ఇంట్లో ఆయినా వాళ్లే తనను అనుభవిస్తుంటే ఆ యువతి మౌనం గా రోదించింది. మానవత్వం మంటగలిసిన ఈ ఘటనలో అమ్మ ఇంటికి భాదతో వచ్చిన ఆ యువతిపై తాత, మేనమామ లైంగికదాడికి పాల్ప డ్డారు.
చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం చాంద్రాయణగుట్ట మహ్మద్‌నగర్‌కు చెందిన షేక్ అప్సర్ (70) ఇంట్లో అయన మనుమరాలు (19) ఉంటుంది. యువతి తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా, తల్లి మరో వ్యక్తిని పెండ్లి చేసుకుంది. యువతిపై తాత అప్సర్, మేనమామ సిద్ధిఖ్ ఒకరికి తెలియకుండా మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు తల్లికి విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.నమ్మి కూతుర్ని తన తల్లి వద్ద ఉంచగా తన తండ్రి సోదరుడే తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడటం తో యువతి తల్లి రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.