25.2 C
Hyderabad
May 8, 2024 10: 49 AM
Slider విజయనగరం

పోలీసు బాస్ ఆదేశాలతో.. డీఎస్పీ ఆధ్వర్యంలో “స్పందన”…!

#DSP

ప్రతీ వారం మాదిరిగా నే ఈ సోమవారం కూడా విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఆదేశాలతో ఎస్సీ ,ఎస్టీ డీఎస్పీ శ్రీనివాసరావు… పోలీసు గ్రీవిన్స్ తీసుకున్నారు. అదీ ఫిర్యాదు దారులకు స్వాంతన చేకూర్చేలా.. ఎండ తీవ్రత దృష్ట్యా.. పోలీసు కాన్ఫరెన్స్ ఏసీ హాలులో ఫిర్యాదు దారుల నుంచీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఆదేశాలతో “స్పందన” కార్యక్రమాన్ని ఎస్సీ ,ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తీసుకున్నారు. సామాన్య ప్రజల నుండి డిఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి,

వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ 36 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

కొత్తవలసకు చెందిన ఒక వ్యక్తి డిఎస్పీ కిఫిర్యాదు చేస్తూ తన ఇంటి నిర్మాణం కొరకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 20 లక్షలకు అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు, ఇప్పటికే 19.60 లక్షలు చెల్లించినట్లు, ఇంటి నిర్మాణం పూర్తి చెయ్యకుండా ఇప్పుడు అదనంగా మరో 4 లక్షలు చెల్లించాలని డిమాండు చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని కొత్తవలస సిఐను ఆదేశించారు. విజయనగరం విటి అగ్రహారంకు చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త మరియు ఇతర బంధువులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారన్న కారణంగా దిశ పోలీసు స్టేషనులో వరకట్న వేధింపుల కేసు నమోదైందని, తన భర్త ఇటీవల చనిపోయారని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని అమ్మేయాలని ఒత్తిడి చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.చీపురుపల్లి మండలం ఇటికర్లపల్లి గ్రామానికి చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు సర్వే నం.88/4 లో గల జీడి చెట్లను అదే ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేసారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని చీపురుపల్లి ఎస్ఐను ఆదేశించారు. విజయనగరం కు చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తన భర్త మరియు ఇతర బంధువులు తనను అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని, శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, ఇరువురికి కౌన్సిలింగు నిర్వహించాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ మహిళా పిఎస్ సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె డిఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి 2.40 లక్షలు తీసుకొని, మోసగించినట్లు, అతని పై చట్టపరమైన చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ

చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐను
ఆదేశించారు. రాజాం కి చెందిన ఒకామె డిఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన ప్రాంతానికి చెందిన ఒకామె తన బంగారు వస్తువును తక్కువ వడ్డీకి కుదువ పెట్టి, వడ్డీ చెల్లిస్తానని, నమ్మించినట్లు, ప్రస్తుతం ఆమె వడ్డీని గాని వస్తువును గాని ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని రాజాం సిఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీగారి కార్యాలయానికి నివేదించాలని అధికారులను డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ సిఐ జె. మురళి, ఎస్బీ సిఐ ఈ. నర్సింహమూర్తి, డిసిఆర్బి ఎస్ఐలు వాసుదేవ్, ప్రభావతి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మెసేజ్ ఓరియెంటెడ్ “ఐడెంటిటీ’ మూవీ రివ్యూ

Bhavani

విజ‌య‌న‌గ‌రంలోని అక్ర‌మ ఆటోల‌పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి….!

Satyam NEWS

ఐసోలేషన్: కరోనా దెబ్బకు అమరావతి ఆందోళన బంద్

Satyam NEWS

Leave a Comment