38.7 C
Hyderabad
May 7, 2024 17: 33 PM
Slider నల్గొండ

సంబరంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

#girlchild

బాలికల సాధికారికత గురించి సమాజంలో ప్రతి ఒక్కరు ఆలోచించి బాధ్యతగా ప్రవర్తించాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి కోరారు. మహిళా, శిశు, వికలాంగుల & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నేడు సోషల్ రెసిడెన్షియల్ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, బాలెంల లో జిల్లాస్థాయి అంతర్జాతీయ బాలికల దినోత్సవం-2022 వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా బాలల పరిరక్షణ అధికారి  బి.రవికుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి పాల్గొన్నారు. ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న IAS, IPS, జడ్జిలు, డాక్టర్స్ అందరూ కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారేనని ఆమె అన్నారు. ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు ఆలోచనలు ఉండాలని ఆమె కోరారు. జిల్లా వైద్యాధికారి డా.కోటాచలం మాట్లాడుతూ పిల్లల సంరక్షణకు అవసరమైన చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలని కోరారు.

ఆడపిల్ల పుడుతుందని భయంతో గర్భస్థ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై చట్టపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు. చైర్మన్-సి.డబ్ల్యూ.సి బి.రమణ రావు మాట్లాడుతూ పిల్లలకు అన్ని విధాల ఆదుకోవటానికి పిల్లల చట్టాలు బలంగా ఉన్నాయని తెలిపారు. సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లల సంరక్షణ, చదువు ప్రాముఖ్యత, ఆడపిల్ల భవిష్యత్తులో ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాల గురించి  చెప్పారు.

బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహం వాళ్ళ జరిగే అనర్ధాలు వాటి వల్ల నష్టాల గురించి చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో పాల్గొన్న అడ పిల్లలకు బహుమతులు ప్రధాన జిల్లా వైద్యాధికారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు డి.సి.పి.యు, చైల్డ్ లైన్, సఖి సెంటర్ సిబ్బంది మరియు సోషల్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Related posts

పీవీకి నివాళి

Satyam NEWS

సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అన్నదానం చేయడమే లక్ష్యం

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment