39.2 C
Hyderabad
May 3, 2024 11: 39 AM
Slider వరంగల్

గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

#abvp

అఖిల భారతీయ  పరిషత్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అనేక రకాల కార్యక్రమాలు ,ఉద్యమాలు చేయడం జరిగిందని ఏబీవీపీ ములుగు నగర కార్యదర్శి  అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రైబల్ యూనివర్సిటీ ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని ఇది భారతీయ జ్ఞాన పరంపరకు ఒక కొనసాగింపు అని అదేవిధంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి సమ్మక్క,సారక్క అని ఒక గిరిజన మహిళల పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టడం అనేది ఎన్నో సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

గిరిజన సాహిత్యం ,కళలు , జీవన విధానం, జీవనశైలి ,గిరిజన జ్ఞాన సంపద ,ఆచార వ్యవహారాల్లో ఉన్న శాస్త్రీయత ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో అనేక కోర్సులలో భాగమవుతాయని అన్నారు. మొదటి నాగరికతను సృష్టించేది గిరిజనులే ఎప్పటికైనా ఆ నాగరికతనే పరంపరాగతంగా ఆధునిక నాగరికతగా పరునవిల్లుతుంది అనే అంశాన్ని అర్థం చేసుకొని  మూలవాసులు ఆదివాసీల పరంపరను గమనించి వారి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఎంతోమంది ట్రైబల్స్ వారి ఉన్నతి కోసం వారిని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా ఉన్నతమైన పరిశోధనలు చేయగలిగి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా వారి అభ్యున్నతి కోసం వారికి ఉన్నతమైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజన బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తు ఆశయాన్ని ట్రైబల్ యూనివర్సిటీని  ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా యూనివర్సిటీ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిపాలన పరమైన అనుమతులు అన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అన్నారు.

Related posts

నిన్న టూటౌన్… నేడు ఆండ్ర: స్టేషనలను తనిఖీ చేసిన పోలీసు బాస్ దీపిక

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కౌంటింగ్‌కు ప‌క‌డ్బంది ఏర్పాట్లు

Satyam NEWS

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్య పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment