27.7 C
Hyderabad
April 30, 2024 07: 58 AM
Slider విజయనగరం

మబ్బులతో కమ్మేసిన ఆకాశం.. చిరుజల్లులతో ఉపశమనం..!

#rains

మే నెలలో ఎండలు మండిపొతాయి..రోహిణి కార్తెలతో రోడ్లు పగలిపోతాయి. ఈ మాటలన్నింటినీ తప్పని చెప్పింది ప్రస్తుత వాతావరణం పరిస్థితి. ఈ మే నెలలో పొద్దున్నే భానుడి భగభగలతో ప్రతీ ఒక్కరూ మండిపోతారు.కానీ మే నెల మోదటి రోజునే విశాఖ వాతావరణం కేంద్రం చల్లని కబురు అందించింది కూడా. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పింది. ఇలా చెప్పిందో లేదో రాష్ట్రంలో ని విజయనగరం జిల్లాలో పొద్దున్నే వాతావరణం చల్లబడిపోయింది. పొద్దున్నే భానుడి భగభగలాడాల్సింది పోయి…కారు మబ్బులు కమ్మేసాయి.నీలిరంగు ఆకాశం కాస్త…నల్లటి మబ్బులతో కమ్ముకు పోయింది. ఆకాశం మొత్తం మబ్బులతో తద్వారా వాతావరణం చల్లబడిపోయింది. కాసేపు చిరు జల్లులు పడ్డాయి. ఓ పావుగంట సేపు వర్షం పడటంతో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. దీంతో వేడి వాతావరణం కాస్త చల్ల బడటంతో జిల్లా ప్రజలు కాస్త సేద తీరారు.

Related posts

రాష్ట్ర మంతటా వేదవ్యాసుని జయంతి వేడుకలు..!

Satyam NEWS

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో స్వామి వివేకానంద చికాగో ఉపన్యాస దినోత్సవం

Satyam NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment