37.2 C
Hyderabad
May 6, 2024 14: 01 PM
Slider ముఖ్యంశాలు

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులి దాడి సంఘటనపై దర్యాప్తు

#MLALonerukonappa

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో పులి దాడికి సంబంధించిన ఘటనపై అటవీ శాఖ విచారణ కొనసాగుతోంది. రెబ్బన అటవీ రేంజ్ దిగడ గ్రామంతో పాటు చుట్టు పక్కల మరో ఆరు అటవీ గ్రామాల పరిధిని అటవీ శాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. అక్కడ సంచరిస్తున్న పులితో పాటు, స్థానికులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

 జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) నిబంధనల ప్రకారం,  సంప్రదింపుల ద్వారా తదుపరి చర్యల కోసం పర్యవేక్షణ కమిటీని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి నియమించారు. అదిలాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినోద్ కుమార్ నేతృత్వంలో,  వన్యమృగాల పరిరక్షణకు పాటు పడే స్వచ్చంద సంస్థల ప్రతినిధి, వెటర్నిటీ డాక్టర్, అటవీ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్ ను కమిటీలో సభ్యులుగా నియమించారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి అది

ఇప్పటికే అధికారుల బృందం దాడి జరిగిన అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. పులి పాదముద్రలను సేకరించటంతో పాటు, సంచరించిన ప్రాంతం గుర్తించారు.  ఇప్పటిదాకా సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్న పులి కాదని అటవీ శాఖ తేల్చింది. తమ వద్ద  ఉన్న పులుల పాద ముద్రలతో పోల్చి చూసిన తర్వాత మహారాష్ట్ర వైపు నుంచి కొత్తగా వచ్చిన కొత్త పులిగా అధికారులు నిర్థారించారు.

పులి కదలికల గుర్తింపుకు ఏడు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు, ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు నిరంతరం పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా దాడి జరిగిన ప్రదేశంతో పాటు, చుట్టు పక్కల నాలుగు బోనులను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది.

అయితే రెండు రోజులుగా పులి కదలికలను బట్టి పెంచికల్ పేట అటవీ ప్రాంతం గుండా మళ్లీ మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.

అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఇతర అధికారులతో నిత్యం సంప్రదిస్తూ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేత

పులి దాడిలో మృతి చెందిన సిడం విజ్ఞేష్  తల్లిదండ్రులు సిడం దాశ్రు ,శంకర్ బాయి లకు అటవీ శాఖ నుండి మంజూరైన ఐదు లక్షల  రూపాయల ( 5,00,000/-) చెక్కు ను అటవీశాఖ, దహేగం మండల నాయకుల తో కలిసి సిర్పూర్ MLA కోనేరు కోనప్ప చేతుల మీదుగా అందచేశారు.

Related posts

ముఖ్యమంత్రిని కలిసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

Satyam NEWS

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

హాల్‌మార్క్ హైకీలో విరాట్ కొహ్లీ హ‌ల్‌చ‌ల్

Bhavani

Leave a Comment