39.2 C
Hyderabad
April 28, 2024 12: 06 PM
Slider సంపాదకీయం

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

arvind-kejriwal

ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ప్రశాంత్ కిశోర్ తన కెరియర్ లో మరో విజయం నమోదు చేసుకున్నట్లు అవుతుంది. ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసిపిని గెలిపించే స్ట్రాటజీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత తీసుకున్న కాంట్రాక్టు ఆమ్ ఆద్మీ పార్టీ దే.

ఆ పార్టీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించేందుకు స్ట్రాటజీ ఇచ్చే బాధ్యతను స్వీకరించిన ప్రశాంత్ కిశోర్ ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లే కనిపిస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు నుంచి తాను తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ప్రచారం చేశారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా రాముడిని, హనుమంతుడిని ఆకాశానికి ఎత్తేలా వ్యూహం మార్చారు.

ఇది బిజెపికి ఊహించని దెబ్బ (ఎగ్జిట్ పోల్స్ ప్రకారం) ప్రధాని నరేంద్రమోడీ దేశ భక్తి అంశాన్ని కావాలని పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక స్కూల్ కార్యక్రమానికి వెళ్లి అక్కడి ఎన్ సి సి క్యాడెట్లతో మాట్లాడుతూ 15 రోజుల్లో పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడిస్తామని చెప్పారు. దానికి ఎలాంటి సందర్భం కూడా లేదు. అయినా తాను చేసిన ప్రసంగం ఢిల్లీ ప్రజలకు చేరి వారిలో దేశభక్తి ఉప్పొంగి బిజెపి ఓటు వేస్తారని అనుకున్నారు.

అదే విధంగా లోక్ సభలో అకస్మాత్తుగా రామజన్మభూమి కి ట్రస్టు ఏర్పాటు చేసే ప్రకటన చేసేశారు. ఇవన్నీ హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకోవడానికి చేసిన జిమ్మిక్కులే. అయితే వీటికి కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే పోయారు. ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రివాల్  తన ప్రచారాన్నికామ్ కీ రాజనీతీ (పని మీద ఆధారపడిన రాజకీయాలు) గా మలచడంలో పైచేయి సాధించారు.

మెహల్లా హల్త్ క్లీనిక్స్, జీరో కరెంటు బిల్లులు, ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చడం అనే అంశాలను ప్రధాన ఎజెండాగా ఆయన ముందుకు తెచ్చారు. అభివృద్ధి ఆధారిత రాజకీయమే దేశభక్తి అని ఆయన స్పష్టం చేస్తూ ప్రచారం చేశారు. ఢిల్లీ లాంటి ప్రదేశంలో మత పోలరైజేషన్ కంటే వేరే విషయం ఒకటి ప్రబలంగా ఉంటుందని ఆయన నమ్మి ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే  ఢిల్లీ శ్రామిక వర్గం, తక్కువ ఆదాయం ఉన్న వారి ఓట్లను ఆప్ ఆకర్షించిందనే విషయం కనిపిస్తుంది.

కేజ్రీవాల్ ప్రచారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేక వ్యూహాత్మక ఎత్తులు, షిఫ్టులను గమనించవచ్చు. ఒక ఇంటర్వ్యూలో కేజ్రివాల్ హనుమాన్ చాలీసా చదవడం ఒక స్ట్రాటజీగా చెప్పవచ్చు. కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా బిజెపి చిత్రీకరించింది. దానికి ఆయన కౌంటర్ ఇవ్వడంతో బాటు రోజూ పూజ చేసే మా డాడీ ఉగ్రవాదా? ఇంత అన్యాయమైన ఆరోపణ చేస్తారా అని కేజ్రీవాల్ కుమార్తె ప్రశ్నించడం ఎక్కువ మందికి చేరింది. ప్రచారం చివరి లో ఆప్ పార్టీ అభ్యర్థులందరూ వారి నియోజక వర్గాలలో దేవాలయాల వద్ద కనిపించారు. అంతే కాదు కొందరు యజ్ఞాలు, పూజాలు నిర్వహిస్తున్నప్పుటి ఫోటోలు పత్రికల్లో వచ్చేలా చేసుకున్నారు. కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకి అని బిజెపి ఆరోపించగానే కేజ్రీవాల్ తన స్ట్రాటజీ మార్చడం బిజెపికి అశనిపాతంలా తగిలి వుంటుంది.

Related posts

మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన సిఐ

Satyam NEWS

బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

Satyam NEWS

శ్రీ పర్వత వర్థిని దేవీ సమేత శ్రీ శాంతి లింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment