39.2 C
Hyderabad
May 4, 2024 22: 05 PM
Slider ప్రత్యేకం

ఓటర్ల జాబితాలో అవకతవకలు సవరించాలి

#BJP

ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వివిధ పోలింగ్ బూతుల్లోకి మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారిని వెంటనే ఒకే పోలింగ్ బూత్ లోకి వచ్చే విధంగా మార్చాలని బీజేపీ కోరింది. జీహెచ్ఎంసీ కమిషనర్, డిఈఓ రోనాల్డ్ రోస్ ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీస్ మీటింగ్ లో బీజేపీ పాల్గొన్నది.

బీజేపీ తరపున తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, పోన్న వెంకటరమణ, కొల్లూరు పవన్ కుమార్, భరద్వాజ్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇబ్బందులను వారు వివరించారు.

ఒకవేళ అలా చేయని పక్షంలో ఫైనల్ పబ్లికేషన్ లిస్టుని ప్రచురించకూడదని డిమాండ్ చేశారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద నిర్వహించిన ఓటర్స్ నమోదు ప్రక్రియలో చాలా మంది బిఎల్వోలు చాలా పోలింగ్ బూత్ లో పాల్గొనలేదని మీటింగ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తడం జరిగిందన్నారు. ఎంఐఎం పార్టీ పాత బస్తీలో బోగస్ ఓట్లను అధిక శాతం నమోదు చేయిస్తుందని భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆరోపించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదని తెలియజేస్తూ ఉదాహరణకు బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ పౌరులు కాని 5000 మంది ఓటర్స్ ని రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సబ్ సెంటర్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

ట్రాజెడీ: భీమడోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

అధికారులు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించాలి

Bhavani

Leave a Comment