33.7 C
Hyderabad
April 29, 2024 00: 50 AM
Slider సంపాదకీయం

పాలనా లోపం ప్రజలకు శాపం

#YS Jagan mohan

పాలనాపరంగా సీఎం జగన్ చేసిన తప్పులతో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వేళా పాళా లేని విద్యుత్ కోతలు ప్రజా జీవనాన్ని, రైతుల పరిస్థితిని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయి. జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కొరత అన్నీ రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితి ఒక వైపు రైతును కుంగదీస్తుంటే మరో వైపు కరెంటు కూడా లేకపోవడం మరిన్ని కష్టాలను తెస్తున్నది.విద్యుత్ పీక్ లోడ్ సాకుతో రాష్ట్రంలో పవర్ కట్ తీవ్ర స్థాయికి చేరింది. తీవ్ర విద్యుత్ సంక్షోభం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వేళపాడులేని విద్యుత్ కోతలను భరించలేక ప్రజలు రోడ్డెక్కుతున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ల ముందు ధర్నాలకు దిగుతున్నారు.

గత వందేళ్ళుల్లో ఎన్నడూ లేని విధంగా ఆగష్టులో వాతావరణం ప్రతికూలంగా మారింది. తీవ్ర వాతావరణ మార్పులకు తోడు పెరుగుతున్న ఉష్టోగ్రతలు అన్ని రంగాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గడిచిన నాలుగేళ్ళల్లో రైతు… ఎన్నడూ చూడని తీవ్ర కరువును చవిచూస్తున్నాడు.

జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నాలుగేళ్ళు అన్నదాత కడుపు నిండా తిండి తిన్నదే లేదు. వారి జీవితాలపై అతివృష్టి.., అనావృష్టి లు తీవ్ర ప్రభావం చూపాయి. వీటికి తోడు ప్రభుత్వానికి సరైన విద్యుత్ ప్రణాళిక లేకపోవడంతో విద్యుత్ కొరత అధికమై రైతు నడ్డివిరుస్తున్నాయి. పరిశ్రమలు సైతం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. గ్రామాల్లో రాత్రులు విద్యుత్ కోతల అధికమవుతున్నాయి.

పగటి పూట రెండు నుంచి మూడు గంటలు.., రాత్రులు మూడు గంటలు విద్యుత్ సరఫరా నిలిపోతోంది. దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సోలార్, హైడల్, విండ్ స్టేషన్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా క్షీణించింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి.

వీటికీ తోడు ధర్మల్ ప్లాంట్స్ లో కూడా క్షేత్ర స్థాయిలో పడిపోయిన బొగ్గు నిల్వలు ఆయా ప్లాంట్ నిర్వహణపై కూడా భారం పడుతోంది. పీక్ లోడు సమయంలో 247 మిలియన్ యూనిట్ల అవసరం కాగా.. 231 యూనిట్లు విద్యుత్ మాత్రమే అందుతోంది. ఏదైతే షార్టేజ్ ఉన్న ఆ విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం వద్ద సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం నేడు ప్రజల పాలిట శాపంగా మారింది.

కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ నుంచి 2,400 మెగావాట్లుకు గానూ.. కేవలం 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలానే విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో 2,560 మెగా వాట్లకుగానూ కేవలం 1,200 మెగా వాట్లు.., రాయలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ లో 1,600 మెగా వాట్లకు గానూ 1200 మెగా వాట్లు.., వీటన్నీంటికీ తోడూ బొగ్గుకొరత.., విద్యుత్ ఉత్పత్తిపై సరైన ప్రణాళిక లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి రంగాలు నిండా అప్పుల్లో కూరుకుపోతున్నాయి.

విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ లో రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే.. అందుకు తగ్గట్లు బొగ్గు అందడం లేదు. బొగ్గు కొరత కారణంగా చాలా ధర్మల్ ప్లాంట్స్ నందు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. మరోవైపు ఏపీలో విద్యుత్ ఉత్పత్తి అంతా ధర్మల్ పవర్ ప్లాంట్స్ పై ఆధారపడి ఉండడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడూ నేషనల్ ధర్మల్ పవర్ ఎక్సేచేంజ్ లో విద్యుత్ ను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా విద్యుత్ డిమాండ్ కు సంబంధించిన ఇండెంట్ ను పెట్టాల్సి ఉంది. కానీ.., ఈ ఇండెంట్ ను పెట్టడంలో ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం ఈ విద్యుత్ కష్టాలకు కారణముంటున్నారు నిపుణులు.

దీంతో విద్యుత్ డిమాండ్ స్థాయికి తగ్గట్టు ఉత్పత్తి జరగకపోవడంతో సెప్టెంబర్ నెలలో ఇంకా విద్యుత్ కోతలు అధికంగా ఉంటాయని తెలుస్తోంది. వరుణుడు కరుణించి.. వర్షాలు పడితే కానీ.., ఈ సమస్యకు పరిష్కారం కనిపించదు అన్నది వాస్తవం. వీటికి తోడు వేడి పెరిగి ఉక్కపోతుల అధికమవడంతో విద్యుత్ వాడకానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. మరోవైపు రైతుకు మూడు గంటల మాత్రమే విద్యుత్ అందడంతో సరిపడ సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నారు.

Related posts

కరోనాతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సాయం

Satyam NEWS

మోహిని అలంకారం లో ఒంటిమిట్ట కోదండ రాముడు

Satyam NEWS

రైతు వేదిక పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment