పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఒక కారు అక్కడ రోడ్డు డివైడర్ ను ఢీకొన్నది. దాంతో కారులో ఉన్న నెల్లి రవి కుమార్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రవికుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతుండగా భీమడోలు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
previous post