39.2 C
Hyderabad
May 3, 2024 14: 12 PM
Slider విశాఖపట్నం

మహా పాదయాత్ర: ఉత్తరాంధ్ర ప్రజలకు వ్యతిరేకత ఉందా?

#mahapadayatra

అమరావతి నుంచి అరసవెల్లి వరకూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారా? ఈ ప్రశ్న చాలా మంది మదిని తొలచివేస్తున్నది. వాస్తవాలు తెలియక ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు కూడా. అయితే అమరావతి రైతుల పాదయాత్ర పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ యాత్రపై వైకాపా నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే వ్యతిరేకత ఉంది.

ఒకసారి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అమరావతి నుండి మొదలైన రైతులు పాదయాత్ర కృష్ణా జిల్లా వరకు బాగానే సాగింది. స్థానికులతో పాటు టీడీపీ, జనసేన, వామపక్షలు,బీజేపీ ,కాంగ్రెస్ లు సైతం యాత్రకు సంఘీభావం తెలిపాయి. గుడివాడ చేరుకున్న యాత్ర పై వైకాపా రంగు రాజకీయం మొదలైంది. గుడివాడ లో రైతులకు వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పడ్డాయి.

ఈ బ్యానర్లు వైకాపా నాయకులు ఏర్పాటు చేశారు ఈ నియోజకవర్గం మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నది. కొడాలి వర్గీయులు బ్యానర్లు తో ఓ మోస్తరు రచ్చ చేశారు. సీన్ కట్ చేస్తే తణుకులో నల్ల బెలూన్లు, వ్యతిరేక ప్ల కార్డులు ప్రదర్శించారు. ఇక్కడో విశేషం ఏమిటి అంటే ఆ బ్యానర్లు లో కూడా వైకాపా నాయకుల బొమ్మలే ఉన్నాయి. స్థానిక ఎం.ఎల్.ఏ పైగా మంత్రి కూడాను అయిన కారుమురి నాగేశ్వరరావు బొమ్మలతో బ్యానర్లు కట్టడం విశేషం. అధికార వైసీపీ స్థానిక వ్యాపారస్తులను బెదిరించి మరీ బ్యానర్లు కట్టిస్తున్నారు.

సీన్ సిట్ చేస్తే రాజమండ్రి లో ఈ సారి వైకాపా ఎంపీ భారత్ వంతు… ఈయన అంతకు మించి చేశారు.. వాళ్ళు బ్యానర్లు, ప్ల కార్డులతో సరిపెడితే.. భారత్ వాటర్ బాటిల్స్ తో రైతులపై దాడికి తమ కార్యకర్తలను ఆయన ఉసిగొల్పారు. పైగా ఈ ఎంపీ గారు ఈసారి ఎం.ఎల్.ఏ గా పోటీ చేయాలని యోచనలో ఉన్నారట. దీనిలో భాగంగా అధిష్టానం వద్ద మార్కులు కొరకు దాడులు చేయించినట్లు అర్ధం అవుతున్నది.

ఇంకా అసలు స్టార్ మంత్రి దాడిశెట్టి రాజా తునిలో తమ సత్తా చూపడానికి, నర్సీపటం లో కాలు విరగొట్టుకున్న పేట్ల గణేష్, యువ మంత్రి అదేనండి అనకాపల్లి ఎం.ఎల్.ఏ మంత్రి గుడివాడ లు సైతం వ్యతిరేక గళం వినిపించడమే కాకుండా మరింత హడావిడి లు చేయడానికి సిద్ధాంగా ఉన్నారు. ఎక్కడ కూడా రైతుల యాత్రని ప్రజలు వ్యతిరేకించడం లేదు.. కేవలం వైకాపా నేతలు మాత్రం యాత్రకు అడ్డు తగులుతున్నారు.

Related posts

సినీ కార్మికులకు అండగా నేనున్నాను

Bhavani

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు

Satyam NEWS

పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Satyam NEWS

Leave a Comment