33.7 C
Hyderabad
April 29, 2024 00: 38 AM
Slider ఆదిలాబాద్

పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య పనుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

nirmal collector 29

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి పనులు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖీ పట్టణ ప్రత్యేక అధికారులు, సూపర్ వైజింగ్ అధికారులను  ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి సూపర్వైజింగు అధికారులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి లో పారిశుద్ధ్యం, మురికినీటి కాలువలు, ఎలక్ట్రికల్, చెత్త ఉన్న ఖాళీ స్థలాలను  గుర్తించి బాగు చేయించాలని అన్నారు. హోటళ్లలో కిచెన్, టాయిలెట్స్ ను పరిశీలించాలి అన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను, థియేటర్లను, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ లను, షో రూమ్ లను ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు.

జెసిబి, బ్లేడ్ ట్రాక్టర్లను వినియోగించి చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ప్రతిరోజు ఏ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు సరి అయిన నివేదిక ఇవ్వాలన్నారు. ట్రాక్టర్లు ఆటోరిక్షాలు వెళ్ళని చోట తోపుడుబండ్ల ను వినియోగించి చెత్తను సేకరించాలని  అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు బాగా పనిచేసి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు.

Related posts

రైతులు ఆగమవ్వద్దు ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది

Satyam NEWS

కాలుష్య రహిత సమాజం భావితరాలకు అందించాలి

Satyam NEWS

సమాజ వికాస కార్యక్రమాలపై సిబిఐటి విద్యార్ధుల అధ్యయనం

Satyam NEWS

Leave a Comment