27.7 C
Hyderabad
April 30, 2024 07: 08 AM
Slider అనంతపురం

విహార యాత్ర కాదు విజ్ఞాన యాత్ర

#Mayor Mohammad Wasim

అనంతపురం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు కార్పొరేటర్ల స్టడీ టూర్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. నగరంలోని కోవూరు నగర్ లో సోమవారం నగర మేయర్ మహమ్మద్ వసీం పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా పారిశుద్ధ్యన్ని పరిశీలించారు. స్థానికులు తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మీడియా తో మాట్లాడుతూ అనంతపురం నగరంలో గత 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి నేడు ముడున్నరేళ్ళ వైసీపీ పాలనలో రూ.800 కోట్లతో అభిరుద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో అర్పణ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కృషితో నగరంలో అన్ని డివిజన్ లలోనూ శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్ గా గుర్తింపు పొందిన ఇండోర్ నగరపాలక సంస్థను పరిశీలించేందుకు కార్పొరేటర్లు, అధికారులకు స్టడీ టూర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

స్టడీ టూర్ కు ప్రభుత్వం కూడా అనుమతి ఉందని, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు ఇప్పటికే పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చాయని, కేవలం అనంతపురం కార్పొరేషన్ మాత్రమే వెళ్లడం లేదన్నారు. గత టిడిపి పాలనలో నాటి పాలకులు విజయనగరం,సాలూరు,తెనాలి,పార్వతీపురం తదితర మున్సిపాలిటీలకు చెందిన సభ్యులు కేరళ,కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించిన విషయం గుర్తు లేదా అని మేయర్ ప్రశ్నించారు.టీడీపీ నేతలు విహారయాత్ర వెళ్లి వచ్చారని మేమైతే విజ్ఞానయాత్రకే వెళుతున్నామని మేయర్ స్పష్టం చేశారు.

అక్కడ పర్యటించి వాటిలో కొన్ని అయిన అనంతపురం నగరంలో సంక్షేమం, అభివృద్ధి తోపాటు మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలు అమలు చేయాలన్నదే మా పాలకవర్గం అభిమతమన్నారు. నగర అభివృద్ధి తమకు ముఖ్యమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి గడప వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం

కృషి చేస్తోందన్నారు.నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరోలేని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇషాక్,అనిల్ కుమార్ రెడ్డి, రహంతుల్లా, కమల్ భూషణ్ తోపాటు డివిజన్ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజలలో పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా పని చేయాలి

Satyam NEWS

యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి ద్విభాషా చిత్రం కోసం సన్నాహాలు

Satyam NEWS

ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment