39.2 C
Hyderabad
May 4, 2024 21: 30 PM
Slider జాతీయం

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధనకర్ ప్రమాణ స్వీకారం

#jagadeepdhankar

14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్భార్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ వృత్తి రీత్యా లాయర్‌. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు.

ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా అంచెలంచెలుగా ఎదిగారు. రాజస్థాన్‌ హైకోర్టులో లాయర్‌గా పచేసిన ధన్‌కర్‌.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్‌ చొరవతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్‌ మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు.

Related posts

రైతు‌ను రాజు‌ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

ఆన్ లైన్ లో ద్వారకా తిరుమల స్వామి వారి కల్యాణం

Satyam NEWS

సీనియర్లు కలిసి రాకపోయినా ఆగని రేవంత్ పయనం

Satyam NEWS

Leave a Comment