33.2 C
Hyderabad
May 14, 2024 11: 24 AM
Slider ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు

#kcr

మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీ పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసాభావన రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సీఎం పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి

Satyam NEWS

రెండు తెలుగు రాష్ట్రాలలో లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలి

Satyam NEWS

ఇక ఏ ఎన్నిక అయినా అభివృద్ధే ఎజెండా

Satyam NEWS

Leave a Comment