28.7 C
Hyderabad
April 27, 2024 06: 48 AM
Slider ఆధ్యాత్మికం

ఆన్ లైన్ లో ద్వారకా తిరుమల స్వామి వారి కల్యాణం

#DwarakaTirumala

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి) శ్రీ వేంకటేశ్వర స్వామి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ద్వారాకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం లో ఋత్విగ్వరణ, మృద్గ హణ, అంకురార్పణ, ధ్వజారోహణ పూజాధి కార్యక్రమాలు వైఖానస ఆగమం ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, లోకపాలకుడు సర్వ జగద్రాక్షకుడైన వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించే ఘట్టం ధ్వజారోహణం. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ ఆళ్వార్‌ను ఆరాధించి మహా నివేదన చేసి గరుడ ధ్వజపటాన్ని గగనాన ఎగురవేశారు.

ధ్వజారోహణంతో సమస్త దేవతలను స్వామివారి కల్యాణాన్ని ఆహ్వానించి తిలకించే బాధ్యతను గరుత్మంతుడికి అప్పగించారు. గరుడాళ్వార్‌కు మహానివేదన చేసిన గరుడ ముద్దల ప్రసాదం స్వీకరిస్తే సంతానప్రాప్తి, ఆయురారోగ్యమస్తు సకల శుభాలు కల్గుతాయని భక్తులు బలంగా నమ్ముతారు.

కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాలు మే 29వ తేదీ వ‌ర‌కు ఆలయంలోనే ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయని ఈ ఓ సుబ్బారెడ్డి తెలిపారు.

కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమదూరం పాటిస్తూ మాస్కులు ధరించి అవసరమైన సమయాలలో శానిటైజర్ వాడుతూ ఏకాంతంగా నిర్వ‌హించామని ఈ ఓ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి.వి.సుబ్బారెడ్డి సతి సమేతంగా, ఏఈవో నాటరాజారావు సి సి శ్రీనివాస్ పరిమిత సిబ్బంది పాల్గొన్నారు. 26 న రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి వారి కళ్యాణమహోత్సవం నిత్యార్జిత కళ్యాణ మండపంలో ఏకాంతముగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు పరోక్షంగా వీక్షించవచ్చు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా రూ. 1,500/-లు రుసుము చెల్లిస్తే భక్తులకు యూట్యూబ్ లింక్ పంపిస్తారు.

దేవస్థానం వారి యూనియన్ బ్యాంకు అకౌంట్ నెం.010710011000189, IFSC Code :UBIN0801071 లో రుసుము జమచేసి పేరు, గోత్ర నామాలు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, రుసుము చెల్లించిన వివరాలను ఈ వాట్సప్ నెంబర్లకు: 9441845400, 8333935558 లకు పంపించాలి.

కండువా, రవిక, అక్షింతలు, కుంకుమ వారి అడ్రసుకు పంపుతారు. ఇతర వివరాలను పై ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి భక్తులకు కావలసిన సమాచారం అడిగి తెలుసు కోవాలని ఈ ఓ సూచించారు.

www.youtube.com/c/DwarakatirumalaDevastanam/live ద్వారా నిత్యార్జిత కళ్యాణం లైవ్ లో వీక్షించవచ్చని తెలిపారు.

Related posts

కార్మిక గర్జన సిఐటియు పాదయాత్ర వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Satyam NEWS

ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత!!

Sub Editor

“అనన్య” అసాధారణ విజయం సాధించాలి

Satyam NEWS

Leave a Comment