రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కరోనా వైరస్ కారణం చూపి ఎన్నికలు వాయిదా వేసిన రమేష్ కుమార్ అధికారులను బదిలీలు ఎలా చేస్తాడని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్ ను కలిసిన తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
151 స్థానాలతో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు కూడా రమేష్ కుమార్ చేసేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బంధువు అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ఏకగ్రీవ ఎన్నికలు గెలవడాన్ని జీర్ణించుకోలేక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశాడని జగన్ అన్నారు. ఎన్నికలు వాయిదా ఆర్డర్ వస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికీ తెలియకుండా ఆర్డర్ ఎవరో రాసిస్తే రమేష్ కుమార్ చదివాడని జగన్ అన్నారు.