Slider హైదరాబాద్

చిరకాల జీవితానికి చిరు ధాన్యాలే ఆధారం

#Jagan Gurujee

హైదరాబాద్ లోని కె పి హెచ్ బి కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రంలో గురువారం జగన్ గురూజీ ఆధ్వర్యంలో మిల్లెట్ చెప్ అధినేత శ్యామ్ తమ నూతన ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అందరికీ వారి ఉత్పత్తులను అందజేశారు.

ఈ మిల్లెట్ కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన బ్రోచర్ ను జగన్ గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ ఉత్పత్తులను ఉద్దేశించి జగన్ గురూజీ మాట్లాడుతూ  ఈ రోజుల్లో ప్రజలు జీవించడం కంటే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికె ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

చిరకాల జీవితానికి చిరు ధాన్యాలు తోడ్పాటునిస్తాయని ఆయన అన్నారు. రోజులు మారుతున్న కొద్దీ తినే ఆహార పదార్థాల్లో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి అని ,ఇలా అనేక రకాల  ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల మనిషి ఆరోగ్యం లో కూడా క్రమంగా మార్పులు వస్తున్నాయని చెప్పారు.

ఇటువంటి తరుణంలో నా శిష్యుడైన శ్యామ్ ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే చిరు ధాన్యాలతో కూడిన నూతన ఉత్పత్తులను ఇలా మార్కెట్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయం అని చెప్పారు. చిరు ధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు అని సూచించారు.

మంచి ఆహారం తీసుకోవడమే మనిషికి ఆరోగ్య రక్ష అని చెప్పారు. మనుషుల ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం చిరుధాన్యాలతో చిరు కాలం బ్రతకాలి అనే ఆలోచనలతో ఇటువంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్న శ్యామ్ ను అభినందించారు.

ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే ఎటువంటి ఉత్పత్తి కైనా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. మొదటిసారిగా తమ యోగ సెంటర్ లో ఇటువంటి ప్రజా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి విచ్చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మిల్లెట్ చెప్ సంస్థ ప్రతినిధులు, యోగ విజ్ఞాన కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు సిఎంకు ఆహ్వానం

Satyam NEWS

ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC

Sub Editor

అంగరంగ వైభవంగా అక్కినేని పాన్ ఇండియా అవార్డ్స్

Satyam NEWS

Leave a Comment