29.7 C
Hyderabad
May 6, 2024 03: 12 AM
Slider ప్రత్యేకం

జగన్ సిద్ధం: ముందస్తు ఎన్నికలు తథ్యం

#YS Jagan Mohan Reddy

ఏపీ లో ముందస్తు ఎన్నికలకు మేము వెళ్లడం లేదు……. అవన్నీ ఊహాగానాలే అని ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆపార్టీ ముఖ్య నేతలు చెబుతున్నా కూడా తీసుకుంటున్న చర్యలు మాత్రం ముందస్తుకు అనుగుణంగానే ఉన్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఒక్క సారిగా ముందస్తు ఎన్నికల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

అంతే కాకుండా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కూడా జగన్ ముందస్తు ప్లాన్ కు ఓకే చెప్పినట్లు ఒక్క సారిగా ఊహాగానాలు గుప్పుమన్నాయి. దానికితోడు పార్టీ యంత్రాంగం మొత్తం ముందస్తు వైపు అడుగులు వేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. పైకి ముందస్తు ఎన్నికలకు పోవడం లేదు అని చెబుతున్నగ్రౌండ్ వర్క్ మాత్రం ఎన్నికలకు వెళ్లేలాగే కనబడుతున్నాయని ఆ పార్టీలో ప్రముఖులు గుస గుసలాడుతున్నారు.

ఇందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదని చెవులు కొరుక్కుంటున్నారు. జగన్ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 2024 మర్చ్ కి ముగుస్తుంది. అంతే కాకుండా బడ్జెట్ సమావేశం కూడా మార్చి లో పూర్తి చేసి .. ఏప్రిల్ లో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విధంగా వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల రిపోర్ట్ లు తెప్పించుకొని బలాబలాలు, బలహీనతలు, వ్యతిరేకతలు పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు.

వైసీపీ ముందస్తు ఎన్నికల టీం ను కూడా సిద్ధం చేసినట్టు, వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు టాక్. ఈ సంవత్సర కాలంలో ప్రజల్లోకి వెళ్లిన నాయకులు, గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వ్యతిరేకత ఉన్న వారి స్థానాల్లో కొత్త ముఖాలు, లేదా మాజీ , ప్రస్తుత మంత్రులకు సైతం టికెట్ లు ఇచ్చి ఆయా స్థానాల్లో వైకాపా జెండా ఎగురవేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరు టికెట్ ఆశిస్తున్నారు.. ఎవరు వారి వారసులను ఈ దఫా పోటీలో నిలుపుతున్నారు.. ఎవరు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.. జంప్ జాలని ఎవరు అనే లిస్ట్ జగన్ చేతిలో ఉన్నట్టు సమాచారం. ఎవరు ఎన్ని అనుకున్నా టికెట్ లు ఇచ్చేది తానేనని .. ఎవరికీ ఇవ్వాలో తనకు తెలుసునని, అప్పగించిన పనులు పూర్తి చెయ్యని వారి పై వేటు తప్పదని అంటున్నారు.

దానిలో భాగంగా జనవరి నుండి కొంత మందికి పెద్ద పదవులు ఇచ్చి.. పెద్ద పదవుల్లో ఉన్నవారికి పార్టీ గెలుపు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ ముఖ్యనేతలకు సమాచారం అనిందించినట్టు టాక్. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించే పనులను జగన్ ముగ్గురు ముఖ్య నాయకుల భుజాలపై పెట్టినట్టు టాక్. అలాగే రెండో దపాలో మంత్రి పదవులు పొందిన కొంతమంది నాయకులకు, మాజీల కు విపక్షాల పై విమర్శలు మరిన్ని ఎక్కుపెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు టాక్. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విధంగా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి విధంగా జగన్ మరోకొంత మంది ముఖ్యులకు అప్పిగించినట్టు భోగట్టా.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటే ఏపీ కూడా ఎన్నికలకు సిద్ధమని మీ సహకారం కావాలని కేంద్రాన్ని కోరినట్టు.. అందుకు మోడీ,షా ద్వయం అభయం ఇచ్చారని ఆ పార్టీ లో ఓ ప్రచారం నడుస్తున్నట్టు టాక్. అధినేత నోరు విప్పే వరకు ఎవరు లీక్ లు ఇవ్వకూడని ముఖ్య నాయకులు ఆదేశాలు జారీ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలేకపోవడం, సిపిఎస్ రద్దు చెయ్యకపోవడం ,సంక్షేమ పథకాలు అమలు తప్ప.. అభివృద్ధి ఏమి చెయ్యకపోవడం వంటివి పదే పదే ఆపార్టీ ఎదురౌతున్న ప్రశ్నలు.

పైగా జీతాలు కూడా 1 వ తేదికి ఇవ్వలేకపోవడం.. ఖజానా వద్ద నిధులు లేకపోవడం.. అప్పులు పెరిగిపోవడం వంటివి జగన్ కి తలనొప్పిగా మారాయి. నవరత్నాలు ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో అమలు చేసి.. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాగానే ముందస్తు ప్రకటన చేస్తారు అనేది ఇన్ సైడ్ టాక్. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలతో 50 శాతం ఓట్లు ఎటు పోవు అని.. ఇక అభ్యర్థులు మంచితనం, జగన్ మార్క్ తో విజయం నల్లేరుపై నడకే అని జగన్ తన పార్టీ నాయకులకు చెబుతున్నారు.

రామకృష్ణ పూడి, సత్యంన్యూస్.నెట్

Related posts

కరోన సమయంలో ప్రజలను అలెర్ట్ చేస్తున్న “ఒకే ఒక్కడు”

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పద్మశాలి సంఘం భేటీ

Satyam NEWS

ఎర్రవాడ జనసంద్రం: కదం తొక్కిన కామ్రేడ్లు

Satyam NEWS

Leave a Comment