27.7 C
Hyderabad
May 4, 2024 08: 10 AM
Slider ప్రత్యేకం

ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీ ప్రజలకు సమాధానం చెప్పాలి

#cpm

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆరెస్సెస్‌తో జమాతే ఇస్లామీ హింద్‌ (జేఐహెచ్‌) సమావేశాన్ని సీపీఎం  ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తప్పుబట్టారు. మైనారిటీల తరఫున ప్రాతినిథ్యం వహించే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. ఆరెస్సెస్‌తో చర్చలు అవసరమని జేఐహెచ్‌ చెప్పడం దాని స్వంత కపటత్వాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు.

ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన ఖమ్మం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మూక హత్యలు, అణగారిన వర్గాల అణచివేత అంశాలపై ఆరెస్సెస్‌తో చర్చల్లో దృష్టి సారించామని జేఐహెచ్‌ ప్రధాన కార్యదర్శి టి. ఆరీఫ్‌ అలీ ఇటీవల పేర్కొన్నారు అని, అయితే, ఆరెస్సెస్‌తో ఏం చర్చించారన్నదానిపై మరింత స్పష్టత దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

చర్చల ద్వారా ఆరెస్సెస్‌లో మార్పు వస్తుందన్న జమాతే ఇస్లామీ హింద్‌ వాదన వింతగా ఉన్నదనీ వివరించారు. భారత్‌లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను తెలియజెప్పడానికి చర్చలు జరిపామన్న వాదని మరింత వింతగా ఉన్నదని వివరించారు.

ఈ చర్చలు దేశంలోని మైనారిటీలకు తోడ్పాటును అందించవని పేర్కొన్నారు. మైనారిటీల రక్షణ అంటే మతస్వేచ్ఛ అనీ, దానికి విఘాతం కలిగిస్తున్నదెవరో తెలియదా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారితో (ఆరెస్సెస్‌) చర్చలు జరిపితే లాకికవాదం, మైనారిటీల రక్షణ ఎలా సాధ్యమవుతుంది? అని వివరించారు. ఈ చర్చలు ఆరెస్సెస్‌ హిందూత్వ అజెండాకు మద్దతు ఇచ్చినట్టుగా కనిపించిందని నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

భారత్‌లో లౌకిక శక్తులు అతివాద హిందూత్వ రాజకీయాలపై పోరాటం చేస్తున్నాయనీ, ఇలాంటి తరుణంలో ఇలాంటి చర్యలు ఆరెస్సెస్‌ అజెండాకు మద్దతునిస్తాయని వివరించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను తొక్కిపెట్టడానికి మతవాదులు ఏకమవు తారనడానికి ఇంత కంటే మించిన రుజువు ఉండదనీ, లౌకిక శక్తులకు ఇది ఒక సవాల్‌ అని పేర్కొన్నారు. ఈ జమాతే ఇస్లామీ హింద్‌ చర్యపై పలు ముస్లిం, మైనారిటీ సంఘాలకు చెందిన నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, నాయకులు జబ్బర్, భండారు రమేష్,  నవీన్ రెడ్డి, రమ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

అన్నదానంతోనే పూర్తి సంతృప్తి గురుగుబెల్లి

Sub Editor

భక్తులతో కిటకిటలాడిన మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం

Bhavani

ప్రధాని మోదీ వరంగల్‌ షెడ్యూల్‌

Bhavani

Leave a Comment