38.2 C
Hyderabad
April 29, 2024 11: 45 AM
Slider ఖమ్మం

స్వంత ప్రాంతాన్ని మరువద్దు

#khammam

విదేశాల్లో విద్యను అభ్యసించినా స్వంత ప్రాంతాన్ని మరువవద్దని ఖమ్మం ఏసీపీ గణేష్ పేర్కొన్నారు. విదేశీ విద్య -2023 పేరుతో ఖమ్మం లో వీసా మాrస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ విదేశాల్లో విద్యను అభ్యసించడం ఇప్పుడు సులభం గా మారిందని అమెరికా దేశంలో దాదాపు 2శాతం భారతీయులు వున్నారని పేర్కొన్నారు. విదేశీ విద్యను మరింత చేరువ చేసెందుకు వీసా మాస్టర్స్ చేసే ప్రయత్నం సఫలం కావాలని కోరారు. మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ సరిపూడి రమాదేవి సతీష్ లు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గత 15 ఏళ్లగా వీసా మాస్టర్స్ వేలాది మందిని విదేశాలలో విద్యను అభ్యసించేందుకు పంపించిందిన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని వారంతా వీసా మాస్టర్స్ సేవలకు ఉపయోగించుకోవాలని కకోరారు.

వీసా మాస్టర్స్ అధినేతలు శ్రీనివాసరావు,చంద్రశేఖర్లు మాట్లాడుతూ విదేశీ విద్య పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, మాల్టా, దుబాయ్ దేశాల విశ్వ విద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు అన్నారు. సుమారు 700 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో హాజరుయ్యి విదేశీ విద్యపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు అన్నారు. ఆయా దేశాలలోని యూనివ్వుసిటీల పూర్తి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వీసా మస్యేర్స్ బ్రోచర్, కాప్లను ఏసీపీ గణేష్ అతిధులతో కలిసి ఆవిష్కరించారు.

Related posts

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు క్రీడా ప్రాంగణాలు లేకపోతే గుర్తింపు రద్దు

Satyam NEWS

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వారు పట్టువదలని విక్రమార్కులు

Satyam NEWS

ప్రజల సమస్యలు పరిష్కారించడమే నా ధ్యేయం

Satyam NEWS

Leave a Comment