32.2 C
Hyderabad
May 12, 2024 20: 46 PM
Slider కడప

నందలూరు లో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

#janasena

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గం నందలూరులో శనివారం జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన నేతలు అట్టహాసంగా చేపట్టారు. ముందుగా నందలూరు బస్ స్టాండ్ కూడలి నుంచి జనసేన పార్టీ రాజంపేట యువ నాయకులు అత్తికారి దినేష్ ఆధ్వర్యంలో శాది ఖానా వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభలో సుమారు 500 మంది జనసేన క్రియాశీలక సభ్యులకు జనసేన నాయకులకు క్రియాశీల సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ అనే పాము పడగ నీడలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. తల్లీ,చెల్లి ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పేరు భ్రష్టు పట్టించారని అన్నారు. చేత గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజల ఉసురు తగులుతుందని అన్నారు. రాజంపేట లో జనసేన అభ్యర్థి గెలిపించి వైసీపీ చెల్లు మనిపిస్తామని అన్నారు.

రాష్ట కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా చెయ్యేరు వరద బాధితులను మూడు నెలల్లో ఆదుకుంటామని చెప్పి హామీ నెరవేర్చ లేదని అన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి చేయకుండా పవన్ కళ్యాణ్ ను సిగ్గు లేకుండా విమర్శించారని అన్నారు.75 సంవత్సరాలు వయస్సు ఉన్న టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ను అరెస్ట్ చేయడం బాధాకరం అన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ  జనసేన ఆధ్వర్యం లో రాజంపేట ను జనసేన అభ్యర్థిని గెలిపించి గిప్ట్ ఇస్తామని తెలిపారు. రాజంపేట పార్లిమెంటరీ ఇంఛార్జి సయ్యద్ మఖరం చాన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో అబద్ధపు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని ఆరోపించారు.టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ను అందరూ గౌరవించి ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

అత్తికారి దినేష్ మాట్లాడుతూ ప్రజలందరూ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని అని అనడానికి ఈ చేరికలే నిదర్శనమని వెల్లడించారు. కాబట్టి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని ఏద్దేవ చేశారు.ఈ సందర్భంగా వక్తలు ఎన్నారై నందలూరు జనసేన పార్టీ ఇంచార్జీ కొట్టే శ్రీహరి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ జన సైనికులు, కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొన్నారు.

Related posts

హూజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

Satyam NEWS

భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రాజధాని మార్పు

Satyam NEWS

భ‌ద్రాచ‌లం వ‌ద్ద పెరుగుతున్న గోదావరి

Bhavani

Leave a Comment